Belief : నమ్మకం.. మీ ఆలోచననే కాదు.. మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనం

by Javid Pasha |   (  Updated:2025-08-01 13:22:51  IST  )

Belief : నమ్మకం.. మీ ఆలోచననే కాదు.. మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనం

Belief : నమ్మకం.. మీ ఆలోచననే కాదు.. మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనం
X

దిశ, ఫీచర్స్ : మూఢనమ్మకం మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. మానసిక దౌర్భల్యానికి దారితీస్తుంది. కానీ నమ్మకం అలా కాదు. మీ మీద మీకు నమ్మకం, మీ ఆలోచనల మీద, జీవితం మీద నమ్మకం మిమ్మల్ని బలవంతులుగా మారుస్తుందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ(Stanford University ) పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. నమ్మకంతో కూడిన సానుకూల ఆలోచనలు మనుషుల మనసును, ఆరోగ్యాన్ని, మొత్తం జీవితాన్ని సైతం మార్చగలవని పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.

సాధారణంగా మనిషి ఆలోచనలు ఆచరణకు దారితీస్తాయి. అవి మాటల్లో వ్యక్తం అయ్యే శబ్దాలుగా, సూచనలుగా మిమ్మల్ని నడిపిస్తాయి. మీ శరీరం ఎప్పుడూ వాటిని ఆలకిస్తుంది. అయితే ఆ ఆలోచనలు నమ్మకంతో కూడినవైనప్పుడు మానవ జీవశాస్త్రాన్ని సైతం మార్చగలవంటున్నారు పరిశోధకులు. అంతేకాదు నమ్మకం(belief) నొప్పిని, ఒత్తిడిని సైతం తగ్గించగలదని, మానసిక వైఖరి ద్వారా హార్మోన్ స్థాయిలను సైతం మార్చగలదని పేర్కొంటున్నారు.

స్టాన్‌ఫోర్డ్ నిపుణుల పరిశోధన ప్రకారం.. మనసులోని బలమైన భావన శరీరంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా సానుకూల ఆలోచనలు లేదా నమ్మకాలు శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు.. ఒక వ్యక్తి తన నొప్పి తగ్గుతుందని నమ్మితే.. మెదడు ఆ నమ్మకాన్ని శరీరానికి సూచనగా పంపి, నొప్పిని తగ్గించే రసాయనాల విడుదలను ప్రేరేపిస్తుంది. తద్వారా నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగు పర్చడానికి మనసు శక్తిని ఉపయోగిస్తుంది. ఇది కేవలం ఏదో ఒక విషయంలో కాదు, జీవితంలోని అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో పనిచేస్తుందని, ముఖ్యంగా నమ్మకం లేదా నమ్మకంతో కూడిన సానుకూల ఆలోచనలు మానవ శరీరంలో జీవర రసాయన ప్రక్రియలను ప్రభావితం చేస్తాయని స్టాన్‌ఫోర్డ్ పరిశోధనపేర్కొన్నది. అందుకే ‘సానుకూలంగా ఆలోచించండి.. నమ్మకంతో ఉండండి. దీనివల్ల మీ జీవితంలో 90% పరిణామాలన్నీ సవ్యంగానే జరుగుతాయ్.. అంటున్నారు నిపుణులు. Link

Next Story