Lemon balm : వామ్మో..! ఈ ఆకులు ఇన్ని అద్భుతాలు చేస్తాయా..? ఇలా వాడితే ఆ సమస్యలన్నీ పరార్ !!

by Javid Pasha |

Lemon balm : వామ్మో..! ఈ ఆకులు ఇన్ని అద్భుతాలు చేస్తాయా..? ఇలా వాడితే ఆ సమస్యలన్నీ పరార్ !!

Lemon balm : వామ్మో..! ఈ ఆకులు ఇన్ని అద్భుతాలు చేస్తాయా..? ఇలా వాడితే ఆ సమస్యలన్నీ పరార్ !!
X

దిశ, ఫీచర్స్ : ఒత్తిడి, ఆందోళన ఈరోజుల్లో నిరంతర సమస్యలుగా మారుతున్నాయి. ముఖ్యంగా నగర జీవితంలో కామన్ అయిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రకరకాల ఆలోచనలు, ఆందోళనలతో సహవాసం చేసేవారే ఎక్కువ. వీటి నుంచి ఉపశమనం కోసం అనేక మార్గాలు, పరిష్కారాలు కూడా ఉన్నాయి. అయితే లెమన్ బామ్(Lemon balm), దాని ఆకులు సైతం ఆ పనిచేయగలవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని ఔషధ గుణాలు స్ట్రెస్, యాంగ్జైటీస్‌తోపాటు పలు ఇతర అనారోగ్యాలను, ఆందోళనలను తగ్గించగలవని పేర్కొన్నది. అదెలాగో చూద్దాం.

*తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించినప్పుడు నిమ్మకాయ వాసన చూస్తే తగ్గుతుందని లేదా లెమన్ బామ్ (scientific name: Melissa officinalis) ఆకుల రసాన్ని సేవిస్తే తగ్గుతుందని చెబుతుంటారు. అయితే ఈ నమ్మకంలో ఏ అతీత శక్తులో ఉండవు. కానీ లెమన్ బామ్ (నిమ్మ గడ్డి) ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు అలాంటి అద్భుతాన్ని చేస్తాయంటున్నారు సైంటిస్టులు. లెమన్ బామ్ అనేది వాస్తవానికి పుదీనా కుటుంబానికి (Lamiaceae) చెందిన ఒక సుగంధ మూలిక, దీని ఆకులు నిమ్మకాయ లాంటి సుగంధాన్ని వెదజల్లుతాయి.

*మెడిటరేనియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం‌లో పబ్లిషైన తాజా అధ్యయనం కూడా మరో కొత్త అంశంతో ముందుకు వచ్చింది. ఏంటంటే.. లెమన్ బామ్ ఎక్స్‌ట్రాక్ట్‌ (Lemon balm extract)ను అంటే దాని రసాన్ని లేదా ఔషధ తైలాన్ని తీసుకోవడంవల్ల ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు దూరం అవుతాయి.

*అధ్యయనంలో భాగంగా పరిశోధకులు స్ట్రెస్, యాంగ్జైటీ నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వయోజనుల(adults)పై స్టాండర్డైజ్డ్ లెమన్ బామ్(Melissa officinalis) ఎక్స్‌ట్రాక్ట్‌ను పరీక్షించారు. 15 రోజుల పాటు జరిగిన ఈ అధ్యయనంలో, 20 మంది స్వచ్ఛంద సేవకులు 300 మి.గ్రా. సైరాకోస్ (Cyracos®) అనే లెమన్ బామ్ ఎక్స్‌ట్రాక్ట్‌ను రోజుకు రెండుసార్లు తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా దాని ప్రభావాన్ని పరీక్షంచగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయని పరిశోధకులు అంటున్నారు.

*లెమన్ బామ్ ఆకుల రసాన్ని లేదా ఔషధాన్ని తీసుకున్న వారిలో ఆందోళన లక్షణాలు (Anxiety symptoms) 18% తగ్గాయని పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు యాంగ్జైటీ రిలేటెడ్‌గా ఉండే ఇతర లక్షణాలు కూడా 15%, నిద్రలేమి 42% తగ్గాయి. స్టడీ మొత్తంలో 95% మంది వలంటీర్లు లెమన్ బామ్ రసాన్ని వినియోగించడం వల్ల సానుకూల ఫలితాలను అనుభవించినట్లు పేర్కొన్నారు.

*శాస్త్రవేత్తలు అధ్యయనం సందర్భంగా లెమన్ బామ్ ఔషధాన్ని వాడిన వారిలో 70% మంది ఆందోళన నుండి పూర్తి ఉపశమనం పొందినట్లు గుర్తించారు. ముఖ్యంగా లెమన్ బామ్‌లోని రోస్మారినిక్ ఆమ్లం అండ్ ట్రైటెర్పెనాయిడ్ పెంటాసైక్లిక్ ఆమ్లాలు (Ursolic and oleanolic acids) వంటి ఫైటోకెమికల్స్ ద్వారా GABA-T (గామా-అమినోబ్యూటిరిక్ ఆసిడ్ ట్రాన్స్‌అమినేస్)ను నిరోధించడం వల్ల సాధ్యమవుతాయని అధ్యయనం పేర్కొన్నది. అంటే దీనివల్ల మెదడులో GABA స్థాయిలు పెరిగి, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి.

Next Story