- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు అంటే ఇతడు.. తల్లిదండ్రులను కాపాడుకునేందుకు భుజాలపై మోసుకుంటూ ఏకంగా 160కిమీ నడిచాడు.. ఫొటోస్ వైరల్
తల్లిదండ్రులు తమ సంతోషానికి అడ్డొస్తున్నారని వృద్ధాశ్రమంలో చేర్చుతున్న ఈ రోజుల్లో ఓ కుర్రాడు చేసిన పని ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటన 2017లో జరగ్గా మరోసారి ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో హింసాకాండ

దిశ, ఫీచర్స్ : తల్లిదండ్రులు తమ సంతోషానికి అడ్డొస్తున్నారని వృద్ధాశ్రమంలో చేర్చుతున్న ఈ రోజుల్లో ఓ కుర్రాడు చేసిన పని ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటన 2017లో జరగ్గా మరోసారి ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో హింసాకాండ పెరిగిపోతున్న సమయంలో.. ఒక రోహింగ్యా యువకుడు తన వృద్ధ తల్లిదండ్రులను రక్షించడానికి అసాధారణమైన ప్రయాణం చేశాడు. 80 ఏళ్ల తండ్రి, 65 ఏళ్ల తల్లిని బుట్టలలో పెట్టుకుని భుజాలపై మోసుకుంటూ.. ఏడు రోజుల పాటు 160 కిలోమీటర్ల దూరం.. చెప్పులు లేకుండా నడిచాడు. చిత్తడి నేలలు, కొండలు, ప్రమాదకరమైన భూభాగాలతో నిండిన ఈ దారి.. మయన్మార్ సైన్యం, రోహింగ్యా సముదాయాల మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మరింత కష్టతరమైంది. 7,00,000 మంది రోహింగ్యాలు పారిపోయేలా చేసిన ఈ దాడులను యునైటెడ్ స్టేట్స్ జాతిహత్యగా పేర్కొంది. కదలలేని తల్లిదండ్రులను కాపాడాలన్న ఈ యువకుడి సంకల్పం.. రోహింగ్యా కుటుంబాలు ఎదుర్కొన్న అపార బాధలను ప్రతిబింబిస్తుంది.
ఈ యువకుడి ప్రయాణం కేవలం శారీరక సహనానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న బంధానికి నిదర్శనం. ఘర్షణలతో నిండిపోయిన ఈ ప్రాంతంలో మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌కు చేరుకున్న అతను.. లక్షలాది రోహింగ్యా శరణార్థులతో కూడిన శిబిరాల్లో చేరాడు. అక్కడ ఆహారం, వైద్యం, విద్య వంటి సౌకర్యాలు చాలా పరిమితం. కాగా అతని కథ.. బలవంతపు సైనిక నియామకం.. సహాయం లేకుండా చేయడం, స్వదేశానికి తిరిగి రాకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న రోహింగ్యా ప్రజల స్థితిగతులను ప్రపంచానికి తెలియజేస్తుంది.






