- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐ దేవత వచ్చేసింది.. భక్తులతో మాట్లాడుతుంది.. సలహాలు ఇస్తుంది.. భవిష్యత్తు కళ్ల ముందే సాక్షాత్కరిస్తుంది..
మలేషియాలోని జోహోర్‌లోని టియాన్‌హౌ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటి AI-ఆధారిత దేవతను ఆవిష్కరించింది. చైనీస్ సముద్ర దేవత మజూ డిజిటల్ గాడెస్‌ను ఇన్నోవేటివ్‌గా లాంచ్ చేసింది.

దిశ, ఫీచర్స్ : మలేషియాలోని జోహోర్‌లోని టియాన్‌హౌ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటి AI-ఆధారిత దేవతను ఆవిష్కరించింది. చైనీస్ సముద్ర దేవత మజూ డిజిటల్ గాడెస్‌ను ఇన్నోవేటివ్‌గా లాంచ్ చేసింది. మలేషియాకు చెందిన టెక్ సంస్థ ఐమజిన్ సృష్టించిన ఈ డిజిటల్ దేవత.. భక్తులతో మాట్లాడటం, భవిష్యత్తులో జరగబోయేది వివరించడం, ఆశీర్వాదాలు అందించడం, సలహాలు ఇవ్వడం వంటివి చేస్తుంది. మజూ 1,065వ జన్మదినం (ఏప్రిల్ 20, 2025) సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ఆవిష్కరించబడగా.. సాంప్రదాయ ఆధ్యాత్మికతను ఆధునిక AI సాంకేతికతతో సమన్వయం చేసింది.
AI మజూ ఎలా పనిచేస్తుంది?
ఈ AI-ఆధారిత మజూ డిజిటల్ స్క్రీన్‌పై సాంప్రదాయ చైనీస్ దుస్తులలో అందమైన మహిళగా చిత్రీకరించబడింది. ఇది చైనీస్ నటి లియు యిఫీ రూపాన్ని పోలి ఉంది. భక్తులు ఈ డిజిటల్ దేవతతో నేరుగా సంభాషించవచ్చు. ఆశీర్వాదాలు కోరవచ్చు. ఆలయంలో తీసిన ఫార్చ్యూన్ స్టిక్స్ అర్థాన్ని అడగవచ్చు. వ్యక్తిగత సమస్యలపై సలహాలు పొందవచ్చు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) ద్వారా AI మజూ.. మాండరిన్‌తోపాటు ఇతర భాషలలో మాట్లాడుతుంది. మజూ కథలు, మత గ్రంథాలు, బోధనల ఆధారంగా గౌరవప్రదమైన సమాధానాలను అందిస్తుంది.
ఐమజిన్ వ్యవస్థాపకుడు షిన్ కాంగ్ AI మజూని ‘పియాన్ కై యున్ (ఊహించని ధన లాభం)’ గురించి అడిగినప్పుడు.. ఆమె శాంతమైన స్వరంతో ‘ఇంట్లో ఉంటే ఊహించని ధన లాభానికి మీ అదృష్టం మెరుగ్గా ఉంటుంది’ అని సలహా ఇచ్చింది. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ నిద్రలేమి సమస్య గురించి అడిగినప్పుడు.. AI మజూ ఆమెను ‘నా బిడ్డ’ అని పిలిచి.. ‘‘పడుకునే ముందు వెచ్చని నీరు తాగండి’’ అని సలహా ఇచ్చింది. ఇది మజూ సంరక్షణ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇంతకీ మజూ దేవత ఎవరు?
మజూ, లేదా లిన్ మో, 960లో చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని మీజౌ ద్వీపంలో జన్మించింది. ఆమె ఓడలు ఛిద్రమైన వారిని రక్షించడానికి ప్రయత్నిస్తూ మరణించినట్లు చెబుతారు. తర్వాత ఆమె సముద్ర దేవతగా ఆరాధించబడింది. నావికుల రక్షకురాలిగా పిలువబడుతుంది. మలేషియా, సింగపూర్, ఇండోనేషియా వంటి ఆగ్నేయ ఆసియా దేశాలలోని చైనీస్ సమాజాలలో ఆరాధించబడుతుంది.
సవాళ్లు, ఆందోళనలు:
AI మజూ ఆధ్యాత్మిక రంగంలో AI పాత్రపై చర్చలను రేకెత్తించింది. కొందరు దీనిని సాంప్రదాయం నుంచి దూరంగా, దైవిక సారాంశాన్ని తగ్గించే చర్యగా భావిస్తున్నారు. AI మానవ ఆధ్యాత్మిక నాయకుల సానుభూతి, అవగాహనను పూర్తిగా ప్రతిబింబించలేదని.. టెక్నాలజీపై ఆధారపడటం వల్ల మానవ సంబంధాలు తగ్గిపోవచ్చని ఆందోళన చెందుతున్నారు. సాఫ్ట్‌వేర్ అంతరాయాలు లేదా పవర్ ఆటంకాలు వంటి సాంకేతిక సమస్యలు భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రభావితం చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






