- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంతోషకరమైన జీవితానికి అదే కారణం.. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సంతోషకరమైన జీవితానికి అదే కారణం.. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

దిశ, ఫీచర్స్ : ఒకప్పటితో పోలిస్తే మానవ సంబంధాల్లోనూ అనేక మార్పులు సంభవిస్తున్నాయని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడన్నీ తాత్కాలిక సంబంధాలేనని, లోతైన, విలువైన, క్వాలిటీ రిలేషన్‌షిప్స్‌కు ప్రయారిటీ తగ్గుతోందని అంటుంటారు. ఒకింత వాస్తవమే అయినప్పటికీ సంబంధాల్లో పాజిటివ్ కోణాలు కూడా ఉన్నాయని హార్వర్డ్ యూనివర్సిటీ( Harvard study)కి చెందిన నిపుణుల అధ్యయనం పేర్కొన్నది. ఇక పర్సనల్ రిలేషన్స్ విషయానికి వస్తే దీర్ఘకాలిక సంతోషం, శ్రేయస్సుకు అత్యంత ముఖ్యమైన అంశం క్వాలిటీ రిలేషన్స్ మాత్రమేనని తెలిపింది.
మానవ సంబంధాలు ఆరోగ్యం, సంతోషం, దీర్ఘకాలిక ప్రయోజనాలు వంటి అంశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులు 85 సంవత్సరాలకు పైగా కొనసాగిన అధ్యయనాన్ని విశ్లేషించారు వేలాది మంది వ్యక్తుల జీవితాలను అధ్యయనం పరిశీలించిందని పేర్కొన్నారు. అయితే సంతోషకరమైన జీవితానికి దీర్ఘకాలికంగా బలమైన, సహాయక సంబంధాలు(Strong, supportive relationships)కారణమని, ఇవి కలిగి ఉన్న వ్యక్తులు ఆరోగ్యవంతంగా, సంతోషంగా ఉండటమే కాకుండా, ఎక్కువ కాలం జీవించారని నిపుణులు తెలిపారు.
మానవ సంబంధాల్లో నాణ్యత(Quality in relationships), లోతైన అవగాహన మాత్రమే దీర్ఘకాలిక సంబంధాలకు, సంతోషానికి, మొత్తం మానసిక శ్రేయస్సుకు దోహదం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కుటుంబం, స్నేహితులు లేదా సమాజంలోని వ్యక్తులతో నిజాయితీతో కూడిన గాఢమైన సంబంధాలు(Deep relationships) కలిగిన వారు మిగతావారితో పోలిస్తే ఆందోళన, ఒత్తిడి, నిరాశ, దీర్ఘకాలిక వ్యాధులు వంటివి తక్కువగా ఎదుర్కొంటున్నారని నిపుణులు పేర్కొ్న్నారు. బాధలు, భావోద్వేగాల సమయాల్లో లోతైన సంబంధాలు రక్షణ కవచంగా పనిచేస్తున్నాయని, ఇవి సంబంధాల్లో సంతోషానికి, మొత్తం ఆరోగ్యానికి, మానసిక శ్రేయస్సుకు దోహదం చేస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది.






