- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్లో చిందరవందరతో మానసిక ఆందోళన.. ఏకాగ్రతపై ఎఫెక్ట్!
మన ఇళ్లు, ఆఫీస్ క్యాబిన్ చిందరవందరగా ఉంటే మన బ్రెయిన్ యాక్టివ్‌నెస్ కోల్పోతుంది. ఒత్తిడితోపాటు ఏకాగ్రతను కోల్పోతాం.

దిశ, ఫీచర్స్: మన ఇంట్లో, ఆఫీస్ క్యాబిన్‌లో వస్తువులు చిందరవందరగా పడివుండటం కూడా మనల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని మీకు తెలుసా? ఇంటి వాతావరణానికి, మానసిక స్థితికి మధ్య చాలా లోతైన సంబంధం ఉందని మెంటల్‌హెల్త్ ఫ్రొఫెషనల్స్ చెబుతున్నారు. అంగడి మన మెదడుపై విజువల్ నాయిస్ లాగా పనిచేస్తోంది. ఇళ్లు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, వారి మనస్సు ప్రశాంతతను కోల్పోయినట్లు ఇటీవల 60 డ్యూయల్-ఇన్‌కమ్ జంటలపై చేసిన సర్వేలో వెల్లడైనట్లు నిపుణులు తెలిపారు.
మానసిక ఆందోళన:
మన చుట్టుపక్క పరిసరాలు చెల్లాచెదురుగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్‌నెస్ కోల్పోతుంది. దీనిని సైకాలజీలో Visual Clutter (కంటికి కనిపించే గందరగోళం) అంటారు. అపరిశుభ్రతను చూడగానే మనలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. వెంటనే అలసట, ఆందోళనకు గురవుతాం. బ్రెయిన్ డిస్ట్రబ్ కావడంతోపాటు కాంన్సట్రేషన్ కోల్పోతాం. ఇంట్లో పనులు పూర్తికాకపోతే ప్రశాంతంగా నిద్రపట్టదు. చేయాల్సిన పనులు మిగిలిపోయాననే ఫీలింగ్స్ వెంటాడటం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. గది శుభ్రంగా ఉంటేనే బ్రెయిన్‌కు విజువల్ లోడ్ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. పరిశుభ్రమైన ఇళ్లు, ప్రశాంతమైన మెదడు అనేది ఆరోగ్యకరమైన జీవనశైలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే కొత్త ఆలోచనలు వేగంగా వస్తాయని, ఆలోచనల్లోనూ స్పష్టత పెరుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఏకాగ్రత కోల్పోతాం:
ఇక న్యూరోసైన్స్ ప్రకారం కళ్లముందు అనవసరమైన వస్తువులు ఎక్కువగా ఉంటే అసలు పనిపై దృష్టి పెట్టనివ్వవట. అందులో మనకు కావాల్సిన వస్తువు వెంటనే కనిపించకపోతే వెతుక్కోవడానికే ఎక్కువ శక్తి ఖర్చు చేస్తామని నిపుణులు పేర్కొన్నారు. చదువుకునే, పనిచేసే టేబుల్‌పై పనికిరాని కాగితాలు ఇతర వస్తువులు ఉంటే పదేపదే ఫోకస్ వాటిపైకి మళ్లుతుంది. ఇది బ్రెయిన్ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఫలితంగా చిన్న చిన్న విషయాల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాం. చికాకు, కోపం, అసహనానికి గురవుతాం. ఎవరైనా చూస్తే పరువుపోతుందని భావిస్తాం. కొన్నిసార్లు సిగ్గుగా ఫీల్ అవుతాం. ఈ క్రమంలోనే మనం ఆత్మవిశ్వాసం కోల్పోతామని, ప్రతిరోజు కనీసం 10నిమిషాలు క్లీనింగ్‌కు కేటాయించాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
ఎలా అధిగమించాలి?
మానసిక ప్రశాంతత కోసం చిన్న మార్పులు చేసుకోండి. ఉదయం లేవగానే ముందు బెడ్ సర్దుకోండి. ఆ తర్వాత వాష్ రూమ్, కిచెన్ సాధ్యమైనంత వేగంగా సర్దేయండి. అదే మిమ్మల్ని రోజంతా క్రమశిక్షణగా ఉండేలా ప్రేరేపిస్తుంది. ఇక ఫోన్, లాప్ టాప్, కంప్యూటర్‌లో అనవసరమైన ఫైల్స్ కూడా డిలీట్ చేయండి. ఇది మెదడుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. మీకు అవసరం లేని వస్తువులను వెంటనే తీసిపడేయండి. మనసు తేలికపడుతుంది. హాలిడే లేదా ఫ్రీ టైమ్‌లో మొత్తం ఇంటిని ఒకేసారి కాకుండా ఒక టేబుల్ లేదా ఒక అలమరాతో చిన్నగా సర్దడం ప్రారంభించండి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందే హాల్ తప్పనిసరిగా సర్ది పడుకుంటే ఉదయం లేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది.






