బ్రేవ్ స్పైడర్ మ్యాన్.. 48 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని సేఫ్టీ లేకుండా..

by Disha Web Desk 7 |
బ్రేవ్ స్పైడర్ మ్యాన్.. 48 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని సేఫ్టీ లేకుండా..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఎవరైనా 60 ఏళ్ల వయసు దాటితే రిటైర్మెంట్ తీసుకుని మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు లేదా చిన్న చిన్న వ్యాపకాలతో కాలం వెల్లదీస్తుంటారు. కానీ ఒక సోలో క్లైంబర్(అధిరోహకుడు) మాత్రం పారిస్‌లోని 48 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకుని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు.

ఫ్రెంచ్ 'స్పైడర్ మ్యాన్'గా పిలువబడే 60 ఏళ్ల అలైన్ రాబర్ట్‌ 187-మీటర్ల టూర్ టోటల్ భవనాన్ని అవలీలగా అధిరోహించాడు. ఈ మేరకు అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు వయసు అడ్డంకి కాదనే సందేశాన్ని ప్రజలకు చేరవేశాడు. మొత్తానికి ఆరు పదుల వయసులో కూడా క్రీడల్లో యాక్టివ్‌గా పాల్గొనవచ్చని నిరూపించాడు. '60 ఏళ్లకు చేరుకున్నప్పుడు ఆ టవర్‌ను మళ్లీ ఎక్కుతానని చాలా ఏళ్ల కిందట నాకు నేను వాగ్దానం చేసుకున్నాను. ఎందుకంటే 60 అనేది ఫ్రాన్స్‌లో రిటైర్మెంట్ వయసును సూచిస్తుంది. కానీ ఇది మంచి వయసని నేను అనుకున్నాను' అని తెలిపాడు.

దీని వెనకున్న కారణం..

వాతావరణ చర్యల ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్న రాబర్ట్.. ఇప్పటికే అనేక సందర్భాల్లో టూర్ టోటల్ ఆఫీస్ ఆకాశహర్మ్యాన్ని కూడా అధిరోహించాడు. ఇక 1975లో పర్వతారోహణ ప్రారంభించిన అతను సౌత్ ఫ్రాన్స్‌‌లోని తన సొంత పట్టణం వాలెన్స్‌కు సమీపాన గల శిఖరాలపై శిక్షణ పొందాడు. 1977లో సోలో క్లైంబింగ్‌ను ప్రారంభించి వేగంగా అధిరోహకుడు అయ్యాడు.

ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, ఈఫిల్ టవర్, శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా ఎత్తైన నిర్మాణాలను అధిరోహించాడు రాబర్ట్. తాళ్ల సహాయం లేకుండా చేతులే ఆసరాగా, ఒక జత క్లైంబింగ్ షూస్, చెమటను తుడిచివేయడానికి పౌడర్‌గా చేయబడిన సుద్దతో కూడిన బ్యాగ్‌ను మాత్రమే ఉపయోగించి భవనాలను ఎక్కుతున్నాడు. దీంతో పలుమార్లు అరెస్టు కూడా అయ్యాడు.

మెంటల్‌ హెల్త్‌పై ఏజ్ డిస్క్రిమినేషన్ ఎఫెక్ట్

Next Story