సంబంధాలను ప్రభావితం చేస్తున్న ఫైనాన్షియల్ స్ట్రెస్.. 33% మంది మోసపోతున్నది దానివల్లే!

by Javid Pasha |   (  Updated:2025-07-02 06:17:54  IST  )

సంబంధాలను ప్రభావితం చేస్తున్న ఫైనాన్షియల్ స్ట్రెస్.. 33% మంది మోసపోతున్నది దానివల్లే!

సంబంధాలను ప్రభావితం చేస్తున్న ఫైనాన్షియల్ స్ట్రెస్.. 33% మంది మోసపోతున్నది దానివల్లే!
X

దిశ, ఫీచర్స్ : ఆనందం, ఆరోగ్యం, సౌకర్యవంతమైన జీవితం ఇవన్నీ ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అయితే ‘అమెరికన్ సోషియోలాజికల్ రివ్యూ జర్నల్’లో పబ్లిషైన తాజా అధ్యయనం మరో కొత్త విషయంతో ముందుకొచ్చింది. ఏంటంటే.. ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా సంబంధాలను ప్రభావితం చేస్తుందని, మిలీనియల్స్‌పై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నది.

అధ్యయనంలో భాగంగా నిరుద్యోగం, ఆర్థిక ఒత్తిడి, ఆర్థిక పరిస్థితి మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగంలేని పురుషుల్లో 33% మంది ఫైనాన్షియల్ స్ట్రెస్ కారణంగా తమ భాగస్వామి వద్ద విభేదాలను కలిగి ఉంటున్నారని, మోసాలను ఎదుర్కొంటున్నారని గుర్తించారు. ముఖ్యంగా మిలీనియల్స్‌లో ఈ పరిస్థితి అధికంగా ఉంటోందని తెలిపారు. ఆర్థిక అస్థిరత సంబంధాల్లో మనుషుల్ని ఎలా బలహీనులుగా మారుస్తుందో, ఎనర్జీ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్‌ను ఎలా దెబ్బతీస్తుందో ఈ అధ్యయనమే చక్కటి ఉదాహరణగా నిపుణులు పేర్కొంటున్నారు.

జీవితంలో ఆర్థిక అస్థిరత(Financial instability) వాస్తవానికి ఒత్తిడి, ఉద్వేగాలను సృష్టిస్తుందని, క్రమంగా ఇది వ్యక్తిగత సంబంధాలను కూడా దెబ్బతీస్తుందని అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు తరచుగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎదుర్కొనే వ్యక్తి తక్కువ ఆత్మవిశ్వాసం, తక్కువ ఆత్మగౌరవం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని కూడా అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు అంటున్నారు. అలాగనీ సంబంధాలలో డబ్బు ఒక్కటి మాత్రమే ముఖ్యం కాదు, కానీ ఆర్థిక భద్రత అనేది సంబంధాలు నిలబడటానికి చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Next Story