వామ్మో.. మాకు భయమైతోంది!

by  |
వామ్మో.. మాకు భయమైతోంది!
X

దిశ, మెదక్: అడవులు తగ్గిపోవడంతో వన్యప్రాణులు జనవాసాల్లోకి అడుగు పెడుతున్నాయి. ఆహారం కోసం, దాహం తీర్చుకోవడం కోసం, లేక దారితప్పి వన్యమృగాలు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో తరచూ చిరుత పులులు, ఇతర జంతువులు ప్రజల మధ్యకు రావటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కొంతకాలంగా అనేక ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం కలకలం సృష్టిస్తున్నాయి. పాడిపశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చూశాం. దీంతో ప్రజలు చిరుతపులి సంచారం అంటేనే ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారిస్తున్నట్లు ఆనవాళ్లను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రామాయంపేట మండలంలోని తొనిగండ్ల గ్రామ పరిసరాల్లో చిరుతపులి సంచారిస్తోన్నట్లు ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రంగేరి రత్నం పొలం వద్ద పశువుల కొట్టంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఆవు దూడ చనిపోవడాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు గ్రామ శివారులో చిరుత అడుగుజాడలను గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరింత నష్టం జరగకముందే చిరుతను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.


Next Story

Most Viewed