లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెలకు అస్వస్థత.. ఆయనకేమైంది..?

by  |

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. గత రెండ్రోజుల క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌లో చేరినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటనేది తెలియాల్సి ఉంది. ఈ వార్త విన్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్త మరవక ముందే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై వార్తలు రావడం టాలీవుడ్‌లో మరింత కలవర పెడుతోంది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed