- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు.. NTA కీలక సూచనలు
జేఈఈ మెయిన్-2025 సెషన్-1 పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: జేఈఈ మెయిన్-2025 సెషన్-1 పరీక్షలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను NTA ఇప్పటికే పూర్తి చేసింది. పరీక్ష రాసే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు పరీక్ష రాసే విద్యార్థులకు NTA కీలక సూచనలు జారీ చేసింది.
* పరీక్ష రాసే విద్యార్థులు కచ్చితంగా తమ అడ్మిట్ కార్డును వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
* అలాగే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
* ఆన్ లైన్ దరఖాస్తు చేసినప్పుడు అప్ లోడ్ చేసినటువంటి పాస్ పోర్టుసైజు ఫొటోను తీసుకెళ్లాలి. దానిని అటెండెన్స్ షీట్‌పై అతికిస్తారు.
* విద్యార్థులు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే బాల్ పాయింట్ పెన్ మాత్రమే వినియోగించాలి.
* దివ్యాంగులైన విద్యార్థులు తమ వెంట మెడికల్ సర్టిఫికెట్ను తీసుకెళ్లడం తప్పనిసరి.
* జామెట్రీ బాక్స్, బ్యాగ్, పర్సు, ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్, డాక్యుపెన్ వంటి నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదు.
* ఎక్కువ పాకెట్స్ ఉన్న దుస్తువులు వేసుకోరాదు. నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.






