Aadhaar update: సెప్టెంబర్ 14 వరకు ఆధార్ అప్ డేట్ సేవలు ఫ్రీ..

by Disha Web Desk 1 |
Aadhaar update:  సెప్టెంబర్ 14 వరకు ఆధార్ అప్ డేట్ సేవలు ఫ్రీ..
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం ఆధార్ లో మన వివరాలను అప్ డేట్ చేయాలంటే రూ.50 వసూలు చేసేవారు. అయితే, ఇప్పుడు ఉచితంగా సెప్టెంబర్ 14 వరకు ఎలాంటి చార్జీలు లేకుండా పౌరులు ఆధార్ సేవలను పొందొచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. మరో 10 రోజుల పాటు ఎలాంటి చార్జీలు లేకుండానే సేవలు పొందొచ్చు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, సంవత్సరం, లింగం, మొబైల్ నంబర్, ఈ మెయిల్ లో మార్పులు చేసుకోవచ్చు. ఆన్ లైన్ నుంచి రూపాయి చెల్లించకుండా ఈ సేవలను పొందొచ్చని యూఐడీఏఐ ప్రకటించింది.

కాకపోతే ఫొటో లేదంటే ఐరిష్ లేదా బయోమెట్రిక్ వివరాలు మార్చుకోవాలంటే అందుకోసం సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు వీటికి నిర్ధేశిత ఫీజులను కూడా చెల్లించాలి. ఎందుకంటే బయోమెట్రిక్ వివరాల అప్ డేట్ కోసం అక్కడి సిబ్బంది అదనపు సమయం వెచ్చించాలి. వచ్చిన వ్యక్తి డెమోగ్రాఫిక్ వివరాలను తీసుకోవాలి. ప్రజలు ప్రతి పదేళ్లకు ఒకసారి తమ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ కోరుతోంది. తద్వారా ఆధార్ డేటాబేస్ లోని సమాచారం తాజాగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.


Next Story

Most Viewed