అది మరపురాని అనుభవం : లారా

by  |
అది మరపురాని అనుభవం : లారా
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా.. ఆనాటి రోజులను గుర్తు చేసుకుంది. 2000 సంవత్సరంలో విశ్వ సుందరి కిరీటం గెలుచుకున్నప్పుడు తనకు ఎలాంటి ఆహ్వానం లభించిందో గుర్తుచేసుకొని మురిసిపోయింది లారా. తనకు ఘనస్వాగతం పలికేందుకు హోమ్ టౌన్ బెంగళూరు మొత్తం తరలివచ్చిందని.. ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపింది. తనతో పాటు వచ్చిన మిస్ యూనివర్స్ అధికారులు భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి ఉలిక్కిపడ్డారని, అంత పెద్ద సంఖ్యలో జనాలను ఎప్పుడూ చూడలేదన్నారని చెప్పుకొచ్చింది లారా.

తనకు ఆహ్వానం పలికేందుకు పరేడ్‌గా వచ్చిన పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దయ్యారని.. ఇప్పటికీ వారిని కలుస్తున్నానని తెలిపింది. ఇదొక మరపురాని అనుభవమని.. థాంక్స్ చెప్పింది. కాగా ‘అందాజ్, భాగమ్ భాగ్, కాల్, పార్టనర్, డాన్’ సిరీస్ లాంటి బాలీవుడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న భామ.. చివరగా ‘హండ్రెడ్’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం ‘బెల్ బాటమ్’ షూటింగ్ కంప్లీట్ చేసిన లారా దత్తా.. రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.



Next Story