డేంజర్‌లో ల్యాబ్ టెక్నిషియన్లు.. భరోసా ఏది..?

by  |
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల గోసను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు 1000 మంది ల్యాబ్ టెక్నిషియన్లకు కొవిడ్ సోకగా 6 మంది సిబ్బంది చనిపోయారు. కరోనాతో 30 మంది కుటుంబ సభ్యులను ల్యాబ్ టెక్నిషియన్లు కోల్పోవడం జరిగింది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఎలాంటి భరోసాలను కల్పించడం లేదు. చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాలను ప్రకటించడంతో టెక్నీషియన్లలో ఆందోళన మొదలైంది.

కరోనా వ్యాధి నిర్ధారణలో కీలక పాత్ర వహిస్తున్న ల్యాబ్ టెక్నిషయన్లు వైరస్ భారినపడి చనిపోతున్నా కాని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం ఉన్నతాధికారులచే చనిపోయిన, వ్యాధి బారీన పడ్డ సిబ్బంది వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ల్యాబ్ టెక్నిషియన్ల అసోసియషన్ తరుఫున వివరాలు సేకరించే పనిలోపడ్డారు. ప్రత్యేక వెబ్‌సైట్ పోర్టల్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ బారీనపడిన ల్యాబ్ టెక్నిషియన్ల వివరాలు సేకరిస్తున్నారు.

రాష్ట్రంలో 1250 మంది ల్యాబ్ టెక్నిషియన్లు..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిధిలో మొత్తం 1250 మంది ల్యాబ్ టెక్నిషియన్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 300 మంది రెగ్యులర్ ఉద్యోగులుండగా మిగతా 950 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి పెరిగినా గత ఏడాది కాలం నుంచి వ్యాధిని ర్ధారణ చేపట్టడంలో ల్యాబ్ టెక్నిషియన్లు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కరోనా పేషెంట్లు తొలిసారిగా ల్యాబ్ టెక్నిషయన్లే చికిత్సలు చేపడుతుండటంతో హెల్త్ కేర్ వర్కర్లలో ముందుగా వీరికే ముందు వైరస్ సోకుతోంది.

రాష్ట్రంలో 1000 మంది టెక్నిషయన్లను కరోనా..

కరోనా విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నిషయన్లలో 1000 మంది వరకు కరోనా సోకింది. వీరిలో ఇప్పటి వరకు 6 మంది టెక్నిషయన్లు వైరస్ వ్యాప్తి పెరిగి మృతి చెందారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు, ఉమ్మడి వరంగల్‌కు చెందిన ముగ్గురు, ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన ఒకరు ఉన్నారు. వీరితో పాటు టెక్నిషియన్లకు చెందిన కుటుంబ సభ్యులు 30 మంది వరకు చనిపోయారు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.

ప్రభుత్వం ఆదుకోవాలి
కరోనాతో చనిపోయిన ల్యాబ్ టెక్నిషియన్ల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే 1250 మంది సిబ్బందిలో అత్యధికంగా 950 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. ప్రభుత్వం ఎలాంటి ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించకపోవడంతో ల్యాబ్ టెక్నిషయన్లలో ఆందోళనమైదలైంది. సిబ్బంది సేవలను గుర్తించి ప్రభుత్వం సరైన తీరులో ఆదుకోవాలి. -రవీందర్, ల్యాబ్ టెక్నిషయన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు

Next Story

Most Viewed