ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు..

by Rajesh |
ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. విచారణ సందర్భంగా రాధాకిషన్ రావు వాంగ్మూలంలో మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు. బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారిన వ్యక్తులపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై రాధాకిషన్ రావు నిఘా ఉంచినట్లు తెలిసింది. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణల ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్‌ను ప్రణీత్ రావు విశ్లేషించారు. బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని ప్రణీత్ రావు టార్గెట్ చేసినట్లు విచారణలో తేలింది. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా ఉంచినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు. కడియం శ్రీహరి రాజయ్య విభేదాలపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, ఈటల, అర్వింద్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్, స్నాప్ చాట్‌లో మాట్లాడిన వారి వివరాలను సేకరించినట్లు రాధాకిషన్ రావు తెలిపారు.

Next Story

Most Viewed