సంగంబండ లోలెవల్ కెనాల్‌లో బ్లాస్టింగ్.. ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

by Aamani |
సంగంబండ లోలెవల్ కెనాల్‌లో బ్లాస్టింగ్.. ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
X

దిశ, మక్తల్: నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్ లోలెవల్ కెనాల్‌లో బండరాయి అడ్డం తో సాగు బడిలోకి వచ్చేదాదాపు 20వేల ఎకరాల ఆయకట్టు భూములు బీడుగా మిగిలాయి. బండరాయి తొలగింపుకు ప్రస్తుత ఎమ్మెల్యే చొరవ తీసుకుని 12 కోట్ల నిధులు మంజూరు చేయడంతో, పనులు ఊపందుకున్నాయి.బండ తొలగింపు పనులు పూర్తయితే ఎనిమిది గ్రామాలోని రైతులు తమ పొలాలు నీరంది సాగుబడిలోకి స్తాయని సంతోషపడుతున్నారు. మరికోందరు రైతులు ఖరీఫ్ పంట సాగుబడి సమయానికల్లా బండ తొలగింపు కాల్వలో సిమెంట్ లైనింగ్ పనులు పూర్తి అవుతాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో మూడు టీఎంసీల నీరు నిల్వతో రెండు పంటలు తీసుకోవడానికి వీలుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిని నిలిపితే కర్ణాటక భూముల ముంపుకు గురవుతాయి. అందుకు నష్టపరిహారం చెల్లించేలా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారా అనే అనుమానం తావిస్తోంది.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మక్తల్ నియోజకవర్గంలో ని పెద్దవాగు పైన సంగంబండ రిజర్వాయర్ ను నిర్మించింది. మూడు టీఎంసీల పై చిలుకల నీటి నిల్వ సామర్ధ్యంతో దాదాపు లక్ష పైచిలుకుల రెండు పంటలకు సాగునీరు అందేలా సంగంబండ ప్రాజెక్టు నిర్మించింది. నిర్దేశించిన టీఎంసీలు నిల్వ ఉండాలంటే ప్రాజెక్టు ఎగువ భాగాన కర్ణాటకలోని యాదగిరి లోని భూమి ముంపుకు గువుతుంది. అందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముంపు భూములకు నష్ట పరిహారం చెల్లిస్తామని ఒప్పందం చేసుకొని రిజర్వా యర్ని నిర్మించారు.రెండు రాష్ట్రాలుగా విడిపోవడం తెరాస ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన సాగునీటి పథకాలను అన్నిటిని నిర్లక్ష్యం చేసి వాటిలో సంగం బండ ప్రాజెక్టు నిలువ నీటికి కెపాసిటీకి చర్యలు మూలకు పడ్డాయి.

మూడు టీఎంసీలపై చిలుకల నీటిని నిలువ నిల్వ చేయడంతో ముంపుకు గురైన కర్ణాటక ప్రాంత ప్రజలు సంగంబండ రిజర్వాయర్ కార్యాలయం దగ్గర కొచ్చి అధికారులపై గోడవ చేశారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి సాగునీటి ప్రాజెక్టు మంత్రి ప్రాజెక్టు అధికారులు తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో, రెండున్నర టీఎంసీలు నీరు నిల్వ ఉంచేలా సంగం బండ ఇంజనీర్ అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఈ చర్యల వల్ల సంగంబండ ప్రాజెక్టు కింద నిర్దేశించిన ఆయకట్టు సాగు బడిలోకి రాలేదు. కృష్ణా నదికి వర్షాకాలం వచ్చే వరద సమయంలో గోప్లాపూర్ పంపింగ్ స్టేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేసేవారు పూర్తిస్థాయి నీటి నిల్వ లేకపోవడం వల్ల ఖరీఫ్ పంట నిర్దేశించిన ఆయకట్టు సాగుబడిలో రాలేదు.కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గిపోయో కాలంలో రిజర్వాయర్లకు నీటి పంపింగ్ జరగక ఖరీఫ్ ఆయకట్టు సాగుబడిలోకి రాకపోయేది అందుకు కారణం. సంగంబండ రిజర్వాయర్ లో మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్లనే పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించలేక పోతున్నామని ప్రాజెక్టు అధికారులు, రైతులు అంటున్నారు. సంగంబండ రిజర్వాయర్ లో పూర్తిస్థాయి నీళ్లు నిలబడితే రిజర్వాయర్ ఎగువ భాగంలో ఉన్న కర్ణాటక భూములు ముంపుకి గురవుతాయి. వాటికి నష్టపరిహారం అందిస్తేనే తప్ప ఇది సాధ్యం కాదని అధికారులు పాలకులకు నివేదిక పంపడం జరిగింది.

అయితే ప్రస్తుతం సంగంబండ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన పూర్తి స్థాయి నీటి నిలువ లేకపోవడం వల్ల యాబై వేల పై చిలుకులు సాగు బడిలోకి వచ్చింది. ఇంకా అదనపు సాగు చేపట్టాలని పాలకుల ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో చెరువులను, కుంటలను నింపి చెరువుల కింద ఆయకట్టుకు నీళ్లు అందించి సాగుబడిలోకి తెచ్చారు.ఈ పద్ధతితో ఖరీఫ్ పంటకు సాధ్యమైన యాసంగి పంటకు మాత్రం పైన పేర్కొన్న భూములకు సాగుబడిలోకి రాలేకపోయింది . అయితే గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల సంగం బండ ప్రాజెక్టు నిర్దేశించిన ఆయకట్టును సాధించలేకపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంగంబండ రిజర్వాయర్ ఎగువ భాగంలో ముంపుకు గురయ్యే భూములకు నష్టపరిహారం చెల్లించేలా కార్యాచరణ రూపొందిస్తామని ఇటీవల ఎన్నికల సందర్భంగా హామీలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే చోరవ సంగంబండ ప్రాజెక్టు పై శ్రద్ధ తీసుకోవడం తో సంగం బండ ప్రాజెక్టు నిర్వాసితుల పెండింగ్ బిల్లులు, ప్రాజెక్టు ఎడమ లోయెస్ట్ కెనాల్ లో బండను తొలగింపు నిధులు మంజూరు చేయడం జరిగింది.

ప్రస్తుతం బండ తొలగింపు పనులు ప్రారంభమైయ్యాయి. దీంతో మక్తల్ మండలం పరిధిలోని సంగంబండ, గుర్లపల్లి, వనాయ్ కుంట,దాసరిదొడ్డి,తిర్మలాపూర్, చందాపూర్, మాగనూరు మండల పరిధిలోని వర్కూరు, మాగనూరు, ఓబులాపూర్ ,పేగడబండ, వడ్వాట్, అమ్మపల్లి, తదితర గ్రామాల్లో ఇరవై వేల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందుతుంది. దీనికి అనుబంధంగా ఉండే అప్రోచ్ కెనాల్ పూర్తైతే దాదాపు 30 వేల ఎకరాల సాగు బడిలోకి వస్తుందని సంబంధిత ఇంజనీర్లు అంటున్నారు. సంగంబండ రిజర్వాయర్ లో నిర్దేశించిన నీటిని నిల్వ ఉండాలంటే ప్రాజెక్టు ఎగువ భాగమున కర్ణాటక యాదగిరి జిల్లాలోని ముంపు గురయ్యే భూములకు నష్టపోరాటం చెల్లించేలా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దీంతో రాష్ట్రంలో వలస ప్రాంతం కరువు జిల్లాగా పేరొందిన మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ప్రాంతల భూములకు సాగునీరు ప్రజలకు చేతినిండా పని తో ఈ ప్రాంతం అబివృద్దికి దోహద పడుతుందని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు.

Next Story

Most Viewed