నాపై నాకే నమ్మకం లేదు.. నా ఆస్తిలో 50% ఎవరికీ ఇవ్వను - హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైరల్

by Kavitha |
నాపై నాకే నమ్మకం లేదు.. నా ఆస్తిలో 50% ఎవరికీ ఇవ్వను - హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: మోడల్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటాషా స్టాంకోవిచ్‌ను హార్దిక్ పాండ్యా 2020లో వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే వీరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల, నటాషా స్టాంకోవిక్ కూడా దిశా పఠానీ ఆరోపించిన ప్రియుడు అలెగ్జాండర్‌తో కనిపించింది. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇదిలా ఉంటే, హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిచ్ 70% ఆస్తిని డిమాండ్‌ చేసిన విషయం తెలిసినదే.

కాగా హార్దిక్ పాండ్యా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో, హార్దిక్ పాండ్యా తన తల్లి తన వద్ద ఉన్న అన్ని ఖాతాలకు భాగస్వామిగా ఉంటదని.. తన ఆస్తిలో రూ. 50% హక్కు అతని తల్లికే చెందుతుంది. తాను ఏది కొన్నా.. అది కారు అయినా, ఇల్లు అయినా ప్రతిదానిలో అమ్మకు సమాన వాటా ఉంటుందని పేర్కొన్నాడు. "నాపై నాకు నమ్మకం లేదు. 50 శాతం ఆస్తి ఎవరికీ ఇవ్వను. 50 శాతం ఆస్తి నాకు చాలా పెద్దది. కాబట్టి మీ పేరు మీద ఉండనివ్వండి. అప్పుడు 50 శాతం ఆస్తి ఎవరికి రాదు" అని హార్దిక్ పాండ్యా ఆస్తి గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొత్తం హార్దిక్ పాండ్యా రూ.91 కోట్ల ఆస్తిలో 70 శాతం నటాషా స్టాంకోవిచ్ డిమాండ్ చేసింది. అయితే హార్దిక్ పాండ్యా తల్లికి 50% షేర్ ఉండటంతో రూ.45.5 కోట్లు అతనికి దక్కగా 31.85 కోట్ల రూపాయలు నటాషా షేర్‌గా రాయనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed