నీతో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్న.. బావ

by Shyam |

<p>దిశ, మెదక్: తెలంగాణ మంత్రి హరీశ్ రావు 48వ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనకు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బావ గారు మీరు ఆయురారోగ్యాలతో ఉండి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ట్విట్టర్లో రెండు ఫొటోలను పోస్ట్ చేసిన కేటీఆర్.. తనదైన రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘గౌరవనీయులైన ఆర్థిక మంత్రి, మంచి పనిమంతుడు, డైనమిక్ హరీశ్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. జీవితాంతం ఆరోగ్యంగా, [&hellip;]</p>

నీతో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్న.. బావ
X

దిశ, మెదక్: తెలంగాణ మంత్రి హరీశ్ రావు 48వ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనకు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బావ గారు మీరు ఆయురారోగ్యాలతో ఉండి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ట్విట్టర్లో రెండు ఫొటోలను పోస్ట్ చేసిన కేటీఆర్.. తనదైన రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘గౌరవనీయులైన ఆర్థిక మంత్రి, మంచి పనిమంతుడు, డైనమిక్ హరీశ్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. జీవితాంతం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. బావా.. నిత్యం ప్రజా సేవలో తరించి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రాజకీయంగానైనా, ప్రభుత్వ రంగంలోనైనా నీతో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Next Story