దిశా.. ముసలి హీరోల పక్కన నిన్ను చూడలేకపోతున్నాం : కేఆర్‌కే

by  |
disha patani
X

దిశ, సినిమా : ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ బాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారింది. రీసెంట్‌గా ‘రాధే’ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్‌కు జంటగా నటించిన భామ.. నేడు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా యాక్టర్, ఫిల్మ్ క్రిటిక్ అయిన కమల్ ఆర్ ఖాన్‌ తనకు బర్త్ డే విషెస్ తెలియజేశాడు. అయితే ఈ మేరకు చేసిన ట్వీట్‌లో సల్మాన్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ముసలి యాక్టర్ల పక్కన నిన్ను జంటగా చూడటం భయంకరంగా ఉంది. దయచేసి టైగర్‌‌తో మాత్రమే పనిచేయి’ అని సూచించాడు కమల్. కాగా దిశ పటానీ కొంతకాలంగా టైగర్ ష్రాఫ్‌తో రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ‘రాధే’ సినిమాకు కమల్ ఖాన్ ఇచ్చిన రివ్యూపై దిశ కోస్టార్ సల్మాన్ తనపై కేస్ ఫైల్ చేయగా.. అది రివ్యూ కోసం కాదని, సల్మాన్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు చేసినందుకని కమల్ లాయర్ క్లారిటీ ఇచ్చారు.

కాగా ఈ విషయంలో సల్మాన్‌కు సారీ చెప్పేందుకు కమల్ ఆర్ ఖాన్ నిరాకరించడమే కాక, ఈ ఇష్యూలో తనకు 20 మంది బాలీవుడ్ పర్సనాలిటీస్ మద్దతు తెలుపుతూ మెసేజ్ చేసారని వెల్లడించాడు. వాళ్లు చేయలేనిది తాను చేస్తుండటంతోనే సపోర్ట్ ఇచ్చారని, ఎందుకంటే వారంతా సల్మాన్‌తో విభేదాలు పెట్టుకునేందుకు భయపడతారని తెలిపాడు.


Next Story

Most Viewed