భారీ రెమ్యునరేషన్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన ‘ఉప్పెన’ బ్యూటీ

by  |
krithi shetty
X

దిశ, సినిమా : ‘ఉప్పెన’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బేబమ్మగా నిలిచిపోయింది. తొలి సినిమాతోనే సూపర్ యాక్టింగ్ స్కిల్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసిన కృతి యూత్ కలల రాణిగా మారిపోయింది. ఈ క్రమంలో దర్శక, నిర్మాతల నుంచి కృతికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని నెక్స్ట్ మూవీలోనూ చాన్స్ కొట్టేసిందని సమాచారం.

‘పందెంకోడి’ ఫేం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి-రామ్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రాజెక్ట్‌కు కృతిని సెలక్ట్ చేశారని తెలుస్తోంది. హీరోయిన్‌కు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కావడంతో బేబమ్మనే బెస్ట్ చాయిస్ అనుకున్నారట మేకర్స్. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్. రామ్ 19వ చిత్రంగా వస్తున్న సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ నిర్మిస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. కాగా, కృతి.. హీరో సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో వస్తున్న కోలీవుడ్ ప్రాజెక్ట్‌లోనూ ఫిమేల్ లీడ్‌గా ఎంపికైందని సమాచారం.


Next Story