కృతికి కోరికలు బాగానే ఉన్నాయే..!

65

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తన వర్క్‌ను ఎంజాయ్ చేస్తుంటుంది. ఏ సెట్‌లో ఎంటర్ అయినా ఓన్ చేసుకునే తను.. సొంతంగా గార్డెన్‌ ఉన్న ఇల్లు కొనాలని అనుకుంటుందట. ఆ తోటలో కూర్చొని మార్నింగ్ టీ తాగాలనే కోరికను వెల్లడించిన కృతి.. ఆ డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకునే క్రమంలో ఉన్నానని చెప్పింది.

తనకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టమని, ఫ్యూచర్‌లో స్కై డైవ్ కూడా చేయాలనుందని చెప్పింది. ఏదో ఒక రోజు నేషనల్ అవార్డు కూడా పొందుతాననే ధీమా వ్యక్తం చేసిన కృతి.. ఏదైనా ఎపిక్ బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ‘బచ్చన్ పాండే’ షూటింగ్ కంప్లీట్ చేసిన హీరోయిన్.. ఆదిపురుష్, గణపథ్, భేడియా, మిమి మూవీస్‌తో బిజీగా ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..