ఓటీటీలో కృష్ణ అండ్ హిజ్ లీలా..

by  |
ఓటీటీలో కృష్ణ అండ్ హిజ్ లీలా..
X

కృష్ణ అండ్ హిజ్ లీలా.. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో రవికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని త్వరలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ‘రూమర్స్ అన్నిటికీ చెక్ పెడుతూ.. కృష్ణ అండ్ హిజ్ లీలా త్వరలో మీ ముందుకి రాబోతోంది’ అంటూ రానా దగ్గుబాటి ట్వీట్ చేయడంతో.. చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లు కన్‌ఫర్మ్ అయిపోయింది. కానీ ఎప్పుడు, ఎలా? అనేది త్వరలో ప్రకటించనున్నారు దర్శక, నిర్మాతలు.

‘ఇక ప్రతీ దర్శకుడికి తన సినిమా బేబీ లాంటిదని అంటుంటారు.. కానీ ఈ చిత్రం తనకు ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ లాంటిదని’ తెలిపాడు డైరెక్టర్ రవికాంత్. మీరు అనుకున్నదాని కంటే చాలా త్వరగా మీ వద్దకు వస్తుందన్నారు. ఇప్పటి నుంచే నా ఎక్స్‌ను మిస్సవుతున్నానన్న డైరెక్టర్.. ప్రేమ అనేది ప్రేమ మాత్రమే అని తెలిపారు.

Next Story