బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ : కొండా ఫైర్

by  |
బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ : కొండా ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగి పరిస్థితి చేజారకముందే వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు పెట్టేందుకు నిర్ణయించారు. రానున్న నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలందరూ ఓ చోటుకు చేరి సంబురాలు చేసుకుంటారని నైట్ కర్ఫ్యూ విధించారు. అయితే, తెలంగాణలోనూ ఆంక్షలు విధించాలని హైకోర్టు సూచించడంతో సభలు, ర్యాలీలపై ఆంక్షలు పెట్టారు.

అయితే, తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రాత్రి 12 గంటల వరకు వైన్సులు, బార్లు, ఈవెంట్లకు అనుమతి ఇవ్వడంతో వైద్య నిపుణులు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి బార్ల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. సీఎం రాష్ట్రాన్ని మద్యానికి బానిస చేశాడంటూ ధ్వజమెత్తారు. అయితే, కేసీఆర్ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story

Most Viewed