- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతుల పట్ల కపటి ప్రేమ చూపిస్తున్న సీఎం
దిశ,దుబ్బాక : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను అరిగోస పెడుతున్నాడని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గురువారం దుబ్బాక పట్టణంలోని స్ధానిక బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు పై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. సన్న, దొడ్డు వడ్లుకు కలిపి క్వింటల్ ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతుల సంక్షేమం పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. రైతులకు బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుబంధు నగదును రైతుల ఖాతాల్లో ఇప్పటికీ జమ చేయడం లేదని, రైతు కూలీలకు ఆర్థిక సహాయం హామీ సంగతేంటని ప్రశ్నించారు. పంటలను బోనస్ తో కొనుగోలు చేస్తామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, అదే విధంగా రెండు లక్షల వరకు పంట రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగంలో ప్రత్యేక బడ్జెట్ విధానం అమలు చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల పరిహారం అందించడంతో పాటు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టి వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. అందుకే బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి,
జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్, వైస్ ఎంపీపీ అస్క రవి, స్థానిక కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, అక్బర్ పేట మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, కో ఆప్షన్ మెంబర్ ఆస స్వామి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గన్ని భూమి రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, బండి రాజు, సంగం ప్రభాకర్, పడల నరేష్ పాల్గొన్నారు.