- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తమిళనాడు సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
దిశ ప్రతినిధి, చిత్తూరు: చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలి ఘాట్ రోడ్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా చిత్తూరు వేలూరు రహదారిపై తమిళనాడు సరిహద్దుల్లో గల గుడిపాల సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై బంగారుపాలెం మండలానికి చెందిన మొగిలి ఘాట్ రోడ్లో రెండులారీలు ఒకటి వెనుక ఒకటి ఢీకొనడంతో అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్ పైకి దూసుకెల్లగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. బంగారుపాలెం మండలం కీరమంద గ్రామానికి చెందిన పది మంది రైతులు ట్రాక్టర్ లో ఎండు గడ్డి తీసుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
వెనుక వైపుగా వస్తున్న భారీ లారీకి బ్రేకులు విఫలమవడంతో మరో లారీని ఢీకొట్టింది. ఆ లారీ ట్రాక్టర్ ను వేగంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మిగిలిన క్షతగాత్రులను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజా ఆస్పత్రి వద్దకు చేరుకొని అన్ని శాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద బాధితులు అందరూ కిరమంద గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.