కోహ్లీ పడిపోయాడు

by  |
కోహ్లీ పడిపోయాడు
X

ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా నీరాజనాలందుకున్న కోహ్లీ పడిపోయాడు. సమకాలీన క్రికెటర్లతో పాటు మాజీలతో కూడా ప్రపంచస్థాయి బ్యాట్స్‌మన్ అంటూ ప్రశంసలందుకున్న కోహ్లీకి న్యూజిలాండ్ టూర్ ఏమాత్రం కలిసిరాలేదు. టీ20ల్లో ఫర్వాలేదనిపించిన కోహ్లీ.. వన్డేలతో పాటు టెస్టుల్లో కూడా తేలిపోయాడు.

పదునైన వ్యూహాలు, నిప్పులు చెరిగే బంతులకు కోహ్లీ లొంగిపోయాడు. దీంతో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 21 పరుగులే చేశాడు. వరుస వైఫల్యాలతో కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దిగజారిపోయాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ, తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం దిగజారి. రెండో స్థానంలో నిలిచాడు. ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

టీమిండియాతో టెస్టులో రాణించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్ సంచలనం మార్నస్ లబుషేన్ నాలుగో స్థానంలో నిలవగా, టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టాప్-10లో ప్రవేశించాడు. మయాంక్ 727 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. అజింక్యా రహానే ఈ ర్యాంకింగ్స్ లో 8వ స్థానం దక్కించుకోగా, చటేశ్వర్ పుజారా రెండు స్థానాలు పతనమై 9వ ర్యాంకుకు పడిపోయాడు.

Next Story