‘చంద్రబాబు వ్యాక్సిన్ ఇప్పించండి.. కావాలంటే కమీషన్ ఇస్తాం’

by  |
‘చంద్రబాబు వ్యాక్సిన్ ఇప్పించండి.. కావాలంటే కమీషన్ ఇస్తాం’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరోనా కట్టడికి వైసీపీ ప్రభుత్వం ఎన్నికోట్లైన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని అన్న కొడాలి నాని, కరోనాపై విషప్రచారం చేసి ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చంద్రబాబును జైలులో పెట్టాలన్నారు. ఏపీలో ఒక్కరోజులోనే 6లక్షల మందికి టీకాలు వేశామని, వ్యాక్సిన్లు కావాలని సీఎం జగన్ ఇప్పటికే రెండుసార్లు కేంద్రానికి లేఖరాశారని కొడాలి నాని అన్నారు. కేంద్రం వ్యాక్సిన్ పంపిస్తే రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రోజుకు 10లక్షల వ్యాక్సిన్లు ఇప్పించండి.. కావాలంటే చంద్రబాబుకు కమీషన్ ఇస్తామని నాని ఎద్దేవా చేశారు.


Next Story

Most Viewed