భారత్‌కి భారీ షాక్.. కివీస్‌తో టెస్ట్ సిరిస్‌కు కీలక ఓపెనర్ దూరం

by  |

దిశ, వెబ్‌డెస్క్: కివీస్ తో టెస్ట్ సిరీస్‌కు ముందే భారత్ కి భారీ షాక్ తగిలింది. సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న KL రాహుల్ తన ఎడమ తొడ కండరాల గాయం కారణంగా కివీస్ తో జరిగే రెండు టెస్టు‌లకు దూరం కానున్నాడు. కెరీర్లోనే భీకర ఫామ్‌లో ఉన్న రాహుల్ టెస్ట్ సిరీస్ కి దూరమవ్వడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. రాహుల్ దూరమవ్వడంతో అటు బ్యాటర్‌గా ఇటు ఓపెనర్‌గా కూడా జట్టు‌కు అతను లేని లోటు స్పష్టంగా ఏర్పడుతుంది. ఫామ్ లో ఉన్న రాహుల్ లేకపోవడం కివీస్ జట్టుకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే భారత జట్టు ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్ ,శుభ్‌మన్ గిల్ వచ్చే అవకాశం ఉంది. తుది జట్టులో రాహుల్ స్థానంను సూర్యకుమార్ యాదవ్ భర్తీ చేయనున్నాడు.

Next Story

Most Viewed