- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో ఊహించని స్థాయిలో కరోనా: కిషన్ రెడ్డి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఊహించని స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను సందర్శించిన ఆయన ఐపీ కొవిడ్ కేర్ సెంటర్, వైద్య పరికరాలు, అత్యవసర మందులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం టెస్టులు, టీకాలు, ఆక్సిజన్ కొరత యావత్ దేశం మొత్తం మీద నెలకొందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ తయారు చేసే పరిశ్రమల్లో ఎక్కవగా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఊహించని స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను సందర్శించిన ఆయన ఐపీ కొవిడ్ కేర్ సెంటర్, వైద్య పరికరాలు, అత్యవసర మందులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం టెస్టులు, టీకాలు, ఆక్సిజన్ కొరత యావత్ దేశం మొత్తం మీద నెలకొందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ తయారు చేసే పరిశ్రమల్లో ఎక్కవగా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇలా తయారుచేసిన ఆక్సిజన్‌ను ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. మిగతా మెడికల్ ఎక్విప్‌మెంట్ కొరత లేకుండా యుద్ధప్రాతిపదికన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Next Story






