నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ‘కియారా’ గెస్ట్ అప్పియరెన్స్!

by  |
నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ‘కియారా’ గెస్ట్ అప్పియరెన్స్!
X

బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీకి యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ‘కబీర్ సింగ్, గుడ్ న్యూజ్’ సినిమాలు వరుసగా సూపర్ హిట్ కావడం.. ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్ సూపర్ సక్సెస్ అవడంతో కియారా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయింది. దీంతో తనకు ముఖ్యమైన అతిథి పాత్రలు చేసే ఆఫర్స్ కూడా వచ్చేస్తున్నాయి.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసబ గుప్తా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ‘మసబ మసబ’. నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న ఈ సిరీస్‌లో మసబ గుప్తా ప్రేమ, కెరియర్, కుటుంబం, స్నేహితుల గురించి చూపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో మసబతో పాటు తన తల్లి నటి ‘నీనా గుప్తా’ కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతుండగా.. మరో సూపర్ గెస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది కియారా.

సోనమ్ నాయర్ దర్శకత్వంలో వస్తున్న సిరీస్‌ను వినియర్డ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అశ్వినీ యర్దిస్ నిర్మిస్తున్నారు. కాగా ఇందులో మసబ డిజైన్ చేసిన డ్రెస్ ధరించే హీరోయిన్‌గా కియరాను నటించాలని కోరారట నిర్మాత. సూపర్ ఫన్‌తో కూడిన ఈ సిరీస్ కాన్సెప్ట్ కూడా బాగా నచ్చడంతో అతిథి పాత్ర చేసేందుకు ఒప్పుకుందట భామ. ఇలా గెస్ట్ రోల్ చేయడం తన మీద తనే స్పూఫ్ చేసుకున్నట్లుగా ఉందంటున్న కియారా.. మసబ చిల్ గర్ల్ అని, ఈ సిరీస్ గురించి తను కూడా వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది.



Next Story