రైతుల పోరాటానికి మద్దతిచ్చినందుకే..

by  |
రైతుల పోరాటానికి మద్దతిచ్చినందుకే..
X

ఛండీగఢ్ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల పోరాటానికి మద్దతు తెలిపినందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీపై కక్షగట్టిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమను ఎంతగా వేధింపులకు గురిచేసినా రైతులకోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హర్యానాలోని జింద్ జిల్లాలో జరిగిన కిసాన్ మహా పంచాయత్‌లో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. రైతులకు మద్దతిచ్చినందుకు గాను దేశ రాజధానిని లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగిస్తూ ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం శిక్షించిందని అన్నారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్‌ (ఎల్జీ) కు అధికారాలు కట్టబెట్టడం ద్వారా కేంద్రం తన పంథా నెగ్గించుకున్నదని వివరించారు. తమ అధికారాలు దక్కించుకునేందుకు ‘మేము స్వాతంత్ర్య పోరాటం చేయాలా..?’ అని ప్రశ్నించారు. కొత్త చట్టాలను నిరసిస్తూ ప్రాణత్యాగాలు చేసిన 300 మంది రైతుల త్యాగాలను వృథా కానీయకుండా చూడటం అందరి బాధ్యత అని తెలిపారు. అంతేగాక ఢిల్లీలోని స్టేడియాలను జైళ్లుగా మార్చాలని కేంద్రం తమపై ఒత్తడి తెచ్చిందని సీఎం ఆరోపించారు. కానీ తాము ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని, అందుకు సంబంధించిన ఫైలును తిప్పి పంపించానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed