‘మరక్కార్‌’ నుంచి మహానటి నయా లుక్స్.. ఫ్యాన్స్ ఫిదా

by  |
keerthi suresh
X

దిశ, సినిమా : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ మూవీ ‘మరక్కార్ : అరబికడలింటే సింహం’. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌కు జోడిగా మహానటి కీర్తి సురేష్‌ నటిస్తుండగా.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నయా లుక్‌ను మూవీ యూనిట్‌తో పాటు కీర్తి సురేష్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి ప్రస్తుతం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ మేరకు స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్ అచ్చం రవివర్మ పెయింటింగ్‌లా ఉంది’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అల్లు అర్జున్ కోసం..తగ్గేదే లే అంటున్న ప్రభాస్



Next Story