కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్

by  |
CM-KCR-1444
X

దిశ ప్రతినిధి, నల్లగొండ/ యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయ పుననిర్మాణ పనుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గుట్టపైకి చేరుకున్న సీఎం కేసీఆర్ మొదటగా.. బాలాలయంలోని స్వామీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెట్టాలని, ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, కరోనా మహమ్మారి పీడ తొలగాలని స్వామిని వేడుకున్నారు. అంతకుముందు అర్చకులు సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, మోత్కుపల్లి నరసింహులు, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సీఎంఓ భూపాల్ రెడ్డి, యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీతా రెడ్డి తదితరులు ఉన్నారు.

ఏరియల్ వ్యూ తో యాదాద్రి వీక్షణ..

సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్​లో యాదాద్రికి బయలుదేరి.. 12.40కి చేరుకున్నారు. ఆలయ పరిసరాలను ఏరియల్ వ్యూ ద్వారా తిలకించారు. అనంతరం కాన్వాయ్​లో ఘాట్​రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. తుది దశ పనులపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆలయ నిర్మాణం చూసి అధికారులు, శిల్పులు, ఇంజినీర్ల పనితీరును మెచ్చుకున్నారు. అనంతరం యాదాద్రి ప్రధానాలయంలోని రామానుజ కూటమిని కేసీఆర్ తిలకించారు. దక్షిణ ద్వారం నుంచి పైఅంతస్తుకు చేరుకుని… విద్యుత్తు దీపాల అలంకరణ, గర్భాలయం ముఖద్వారంపై ఏర్పాటైన ప్రహ్లాద చరితం పలకలను సందర్శించారు. తిరిగి మొదటి ప్రాకారంలోని మాడ వీధుల్లోకి చేరుకుని… గోపురాలను పరిశీలించారు. ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి‌, యాడా వైస్ చైర్మన్ కిషన్ రావు… నిర్మాణాల తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన ముహూర్తం ప్రకటించనున్నారని ముందునుంచి అనుకుంటున్నదే. అయితే కాసేపట్లో ఏర్పాటు చేయబోయే మీడియా సమావేశంలో మహా సుదర్శనయాగం, ఆలయ పునప్రారంభం వివరాలూ వెల్లడిస్తారని తెలుస్తోంది.


Next Story

Most Viewed