‘కేసీఆర్ పోతే పీసీఆర్ ముఖ్యమంత్రి ఐతడు.. ఆగమాగం కావొద్దు’

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-16 04:43:57  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఏ పథకం ప్రారంభించిన ప్రతిపక్షాల అపోహలు, అనుమానాలే అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా కిరికిరి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌‌లోని శాలపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో లేని ఎన్నో స్కీములు, ఇండియాలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో తీసుకొచ్చామన్నారు. మనసున్న ప్రభుత్వాలు ఉంటే పేదలకు అన్ని కార్యక్రమాలు జరుతున్నాయన్నారు. కానీ, ప్రతిపక్షాలు అనుమానాలు, అపోహలు లేకుండా.. మానవనీయ కోణంలో ఆలోచించాలని కౌంటర్ [&hellip;]</p>

kcr
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఏ పథకం ప్రారంభించిన ప్రతిపక్షాల అపోహలు, అనుమానాలే అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా కిరికిరి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌‌లోని శాలపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో లేని ఎన్నో స్కీములు, ఇండియాలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో తీసుకొచ్చామన్నారు. మనసున్న ప్రభుత్వాలు ఉంటే పేదలకు అన్ని కార్యక్రమాలు జరుతున్నాయన్నారు. కానీ, ప్రతిపక్షాలు అనుమానాలు, అపోహలు లేకుండా.. మానవనీయ కోణంలో ఆలోచించాలని కౌంటర్ వేశారు. రాజకీయాలు సహజమని.. కేసీఆర్ పోతే.. మరో పీసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని.. కానీ, తాను పెట్టిన పథకాలను ఎవరూ కూడా తీసివేయలేరని చెప్పుకొచ్చారు. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావొద్దని.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.

Next Story