యాసంగి ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ సంచలన ప్రకటన

983

దిశ, వెబ్‌డెస్క్: వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. బాయిల్డ్ రైస్ కొనబోమని పూర్తిస్ధాయిలో కేంద్రం తేల్చిచెప్పిందని, రాష్ట్రం కూడా వరి ధాన్యం సేకరణ చేపట్టదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని తేల్చిచెప్పారు. రైతులకు క్లియర్‌గా చెబుతున్నానని, కేంద్రం చేతులెత్తిసింది కాబట్టి  యాసంగి పంటకు ఎట్టిపరిస్ధితుల్లోనూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. వర్షాకాలం పంట ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వర్షాకాలం పంటకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సాగు రంగాన్ని మొత్తం అంబానీ, అదానీ చేతిలో పెట్టాలని చూశారని, రైతుల పోరాటం, యూపీ ఎన్నికల కారణంగా సాగు చట్టాలను రద్దు చేసిందన్నారు.

Read more: సిగ్గు, లజ్జ ఉందా? కిషన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

పరిశోధకులకు మరో మమ్మీ లభ్యం.. ఎన్నాళ్ళ క్రితందంటే.