ఏమేముంటాయో వరాలు.. ఎన్నికల ముందు బేరాలు!

by Ramesh Goud |

<p>         సిటీ‘జనుల’‌ముందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం రాబోతున్నారు. హైదరాబాదీలకు చాన్నాళ్ల తర్వాత దర్శనమీయనున్నారు. జేబీఎస్ వద్ద మెట్రోరైలుకు పచ్చజెండా ఊపుతారు. మెట్రో ఫస్ట్ ఫేజ్‌లో లాస్ట్ కారిడార్ ఇదే. ఇదొక విశేషమైతే, ఏడాదిలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలుండడం మరోటి. ముఖ్యమంత్రే ప్రారంభించడానికి ఈ రెండూ ప్రేరణ అయ్యుంటాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరానికి బొచ్చెడు తీపి కబుర్లపై ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లోనే ఉన్నాయి. మెట్రో రెండో దశపై ప్రకటన ఉండబోతున్నదని గెస్. అట్లే, మరింకేమి వరాలిస్తారోనని [&hellip;]</p>

ఏమేముంటాయో వరాలు.. ఎన్నికల ముందు బేరాలు!
X

సిటీ‘జనుల’‌ముందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం రాబోతున్నారు. హైదరాబాదీలకు చాన్నాళ్ల తర్వాత దర్శనమీయనున్నారు. జేబీఎస్ వద్ద మెట్రోరైలుకు పచ్చజెండా ఊపుతారు. మెట్రో ఫస్ట్ ఫేజ్‌లో లాస్ట్ కారిడార్ ఇదే. ఇదొక విశేషమైతే, ఏడాదిలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలుండడం మరోటి. ముఖ్యమంత్రే ప్రారంభించడానికి ఈ రెండూ ప్రేరణ అయ్యుంటాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరానికి బొచ్చెడు తీపి కబుర్లపై ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లోనే ఉన్నాయి. మెట్రో రెండో దశపై ప్రకటన ఉండబోతున్నదని గెస్. అట్లే, మరింకేమి వరాలిస్తారోనని నగరపౌరులు వేచి చూస్తున్నారు. చెప్పబోయే ఏ గుడ్‌న్యూస్ అయినా గ్రేటర్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే ఉంటుందనేది కాదనలేనిది! ఏదైనా వ్యూహాత్మకంగానూ, పబ్లిక్‌ను తమవైపు ఆకర్శించడంలోనూ కేసీఆర్‌దే అసలు సిసలైన నై‘పుణ్యం’! కడపటి గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ టోకున 99 డివిజన్లను గెలుచుకొని సంచలనమే చేసింది. రాబోయే ఎలక్షన్లలోనూ అంతకు తగ్గకుండా అపుడే అంతర్గతంగా జాగ్రత్తలు మొదలయ్యాయి. ఆయా పెండింగ్ సమస్యలపై కేటీఆర్ చాలా లోతుగా, సీరియస్‌గా రివ్యూ చేస్తున్నారు. రోడ్లు, డబుల్ బెడ్రూం గృహాలు, కాలనీ వారీగా రొటీన్ సమస్యలు తదితరాలపై ఫోకస్ పెట్టారు. ఓ వైపు కేటీఆర్ కసరత్తు ఇట్లా ఉండగా, మరో వంక కేసీఆర్ కొత్త హామీలేమైనా ఉంటాయా? చూడాలి. జంట నగరాల దుస్థితి పెనెం మీద నుంచి పొయ్యిల పడ్డట్టయిందని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. కొబ్బరి నీళ్లలా ఏమో కానీ హుస్సేన్‌సాగర్ చుట్టుక్కలకు పోయినపుడు, ముక్కు మూసుకోకుండా చూస్తే చాలని గిచ్చుతున్నాయి!

Next Story