సర్కార్ కీలక నిర్ణయం .. వారందరికీ రూ.5 వేలు ఇస్తాం

39

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో ప్రజల ప్రాణాలు కాపాడడంలో వైద్యాధికారులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే వైరస్ బారీన పడిన వారి పరిస్థితి విషమిస్తే.. ప్లాస్మా థెరపి చేయడం ద్వారా కోలుకుంటారని ఆ చికిత్సను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా ధానం చేయాలని అధికారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక వైద్య విద్య మంత్రి సుధాకర్ ప్లాస్మా దానం చేసేవారికి బహుమానం ప్రకటించాడు. ప్లాస్మా దానం చేస్తోన్న ఒక్కొక్కరికి రూ. 5 వేలు ప్రొత్సాహం ఇస్తామని తెలిపారు. దీనిని మరోలా భావించవద్దని.. ఒకరి ప్రాణాలు కాపాడుతున్న మీకు ప్రభుత్వం తరఫుణ ప్రొత్సాహం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..