కరీంనగర్ స్మార్ట్ వర్క్స్‌లో స్పీడ్ పెంచండి : గంగుల

by  |
కరీంనగర్ స్మార్ట్ వర్క్స్‌లో స్పీడ్ పెంచండి : గంగుల
X

దిశ, కరీంనగర్: కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్నస్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్మార్ట్ సిటీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..వానాకాలం ప్రారంభమైతే పనులకు ఆటంకం కలుగుతుందని కావున, నిర్మాణంలో ఉన్న 9 రహదారుల పనులను స్పీడ్ అప్ చేయాలన్నారు. రోడ్ల విస్తరణ విషయంలో మాస్టర్ ప్లాన్‌లో ఉన్న విధంగా వెడల్పుతో కూడిన నిర్మాణాలు చేపట్టాలన్నారు. రోడ్లపై ఇష్టానుసారంగా నిర్మించిన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి తొలగించాలన్నారు. అలైన్‌‌మెంట్ చేసేప్పుడు రోడ్డు చెడిపోకుండా చూడాలని మంత్రి తెలిపారు. 1997లో నాటి జనాభాకు అనుకూలంగా మొదటిసారి మాస్టర్ ప్లాన్ చేశారని, ప్రస్తుతం స్మార్ట్ సిటీలో రోడ్లను విస్తరిస్తున్నందున సెట్ బ్యాక్ కాని ప్రాంతాలను టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించి, విస్తరణ పనులు జరిగేలా కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు సహకరించాలని గంగుల సూచించారు.జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ..రోడ్ల నిర్మాణాలలో మాస్టర్ ప్లాన్‌కు అడ్డుతగిలే నిర్మాణాలను, అనధికార కట్టడాలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. రోడ్లను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తప్పనిసరిగా తొలగించాలని స్పష్టం చేశారు.మేయర్ వై. సునీల్ రావు మాట్లాడుతూ..పట్టణంలోని ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్రతి వారానికొకసారి ఏజెన్సీ, కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీ పనుల పురోగతిని సమీక్షించాలన్నారు.ఏజెన్సీలకు నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయకుంటే నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు వివరించారు.

Next Story

Most Viewed