విమర్శలు కాదు.. సూచనలు చేస్తున్నాం

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్: కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పటం సూచనలు అవుతాయో తప్పా విమర్శలు కావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ మాత శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్యులకు, స్టాప్ కు సోమవారం కరోనా కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణాత్మకంగా చెప్తున్న విషయాలను సూచనలుగా చూడాలే తప్పా మరో కోణంలో చూడకూడదన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వెంటనే కిట్స్ పంపిణీ [&hellip;]</p>

విమర్శలు కాదు.. సూచనలు చేస్తున్నాం
X

దిశ, కరీంనగర్: కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పటం సూచనలు అవుతాయో తప్పా విమర్శలు కావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ మాత శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్యులకు, స్టాప్ కు సోమవారం కరోనా కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణాత్మకంగా చెప్తున్న విషయాలను సూచనలుగా చూడాలే తప్పా మరో కోణంలో చూడకూడదన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వెంటనే కిట్స్ పంపిణీ చేయాలన్నారు. కేంద్రం ప్రభుత్వం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకుండా అలసత్వంగా వ్యవహరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కరోనాపై పోరాటం చేస్తున్న డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Tags;Bjp state president,karimnagar Mp Bandi sanjay

Next Story