మార్కెట్‌ను బట్టే రేటు.. మీకేంటి నొప్పి : పూజా

by  |
మార్కెట్‌ను బట్టే రేటు.. మీకేంటి నొప్పి : పూజా
X

దిశ, సినిమా : హీరోయిన్ పూజా హెగ్డే, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు మద్దతుగా నిలిచింది. అప్‌కమింగ్ మైథలాజికల్ ఫిల్మ్‌లో ‘సీత’ పాత్ర చేసేందుకు రూ.12 కోట్లు డిమాండ్ చేయడంపై కరీనా ట్రోల్స్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ న్యూస్ బయటికి వచ్చినప్పటి నుంచి కరీనా రెమ్యునరేషన్‌‌పై సోషల్ మీడియాలో అనేక డిస్కషన్లు మొదలవగా.. తనను సినిమా నుంచి తొలగించాలంటూ ‘బాయ్‌కాట్ బెబో’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయంలో పలువురు హీరోయిన్లు బెబో కి మద్దతుగా నిలిచారు.

ఇక తాజాగా టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఆ లిస్ట్ లో చేరింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన పూజ హెగ్డే.. తనకు ఎంత మార్కెట్ ఉంటే అంతే అడిగిందని, అందులో తప్పేముందని ప్రశ్నించింది. ఎవరైనా నటుడు పెద్ద మొత్తం డిమాండ్ చేస్తే మాత్రం ఎవరూ నోరు మెదపరని వివరించింది. కొందరికి కొన్ని అభిప్రాయాలుంటాయని, ఎందుకంటే వాళ్లు చేసే పని అదేనని ట్రోలర్స్‌కు చురకలంటించింది.

అడిగినంత రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్‌ ఇవ్వగలిగితే ఇస్తాడన్న పూజా.. ఇదంతా ప్రొఫెషన్‌లో భాగమేనని, కరీనా కూడా ఈ విషయంలో బాధపడి ఉండదని పేర్కొంది. ఫైనల్‌గా మహిళలు తమ విలువను గ్రహిస్తే, అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతారని చెప్పింది. కాగా పూజ నటించిన ‘రాధేశ్యామ్’ రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రస్తుతం సల్మాన్‌తో ‘భాయ్‌జాన్’, రణ్‌వీర్‌తో ‘సర్కస్’తో పాటు తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.


Next Story

Most Viewed