డిజిటల్ ప్లాట్‌ఫామ్‌‌లోకి చందమామ ఎంట్రీ

by  |
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌‌లోకి చందమామ ఎంట్రీ
X

కరోనా రాకముందే.. ఓటీటీల ట్రెండ్ మొదలైంది. అయితే, కరోనా లాక్‌డౌన్ కారణంగా సినీ ప్రేమికులంతా ఓటీటీ వైపు మళ్లారు. ఇప్పటికే బాలీవుడ్‌లో స్టార్ హీరో, హీరోయిన్లు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్నారు. అంతేకాదు వీటికి సినిమాలకు మించి సక్సెస్ ఉండటంతో.. రాబోయే రోజుల్లో వీటి హవా మామూలుగా ఉండదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో టాలీవుడ్‌ స్టార్స్ కూడా వెబ్ సిరీస్‌ల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే జగపతిబాబు, నవదీప్, సందీప్ కిషన్, ప్రియమణి, సమంత, అమలాపాల్‌లు వెబ్ సిరీస్ అవకాశాలు దక్కించుకున్నారు. తాజాగా చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా ఓ హారర్ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తొలి సినిమా ‘చెన్నై 600028’తోనే పలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు.. ఓ వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేశారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏడు ఏపిసోడ్స్‌తో ఓ హారర్ వెబ్ సిరీస్ చేస్తున్నానని, అందులో మెయిన్ లీడ్‌గా కాజల్ అగర్వాల్ కనిపిస్తుందని వెల్లడించారు. ఇందులో హీరో వైభవ్‌తో పాటు ఆనంది కూడా నటిస్తున్నట్లు స్పష్టం చేశాడు. అంతేకాదు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని కూడా తేల్చేశాడు. త్వరలోనే పూర్తి విషయాలు అధికారికంగా వెల్లడిస్తామని వెంకట్ తెలిపాడు. ఈ వెబ్ సిరీస్‌లో కాజల్ క్యారెక్టర్ ఏంటన్నది చెప్పకపోయినా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి కాజల్ అడుగుపెడుతున్న విషయం మాత్రం కన్‌ఫార్మ్ చేశాడు. మరి చందమామకు తొలి వెబ్ సిరీస్ ఎన్ని అవకాశాలను తెచ్చి పెడుతుందో చూడాలి. కాజల్ ప్రస్తుతం ఆచార్య, మోసగాళ్లు సినిమాలతో పాటు ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది


Next Story

Most Viewed