కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న జో బైడెన్

33

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఫైజర్ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. గత నెల 21వ తేదీన బైడెన్ తొలి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్బంగా బైడెన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుంటున్న సమయంలో కొంత ఒత్తిడికి గురైనట్టు చెప్పారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు. కరోనాను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.