రూ. 2 లక్షల జీతంతో NHAIలో మేనేజర్ ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
రూ. 2 లక్షల జీతంతో NHAIలో మేనేజర్ ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన సంస్థల్లో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 42

పోస్టుల వివరాలు:

జనరల్ మేనేజర్ (లీగల్) - 1

డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్) - 41

వేతనం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్లకు రూ. 78,800 నుంచి రూ. 2,09,200 వరకు ఉంటుంది.

జనరల్ మేనేజర్లకు రూ. 1,23,100 నుంచి రూ. 2,15,900 చెల్లిస్తారు.

వయసు: జనరల్ మేనేజర్ పోస్టులకు గరిష్ట వయసు 56 ఏళ్లు.

డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు - వర్తించదు.

అర్హత: ఈ పోస్టులకు ఎల్ఎల్‌బీ ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

జనరల్ మేనేజర్ పోస్టులకు సంబంధిత వర్క్ ఎక్స్ పీరియన్స్ 14 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ /ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: లేదు.

ఆన్‌లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: మే 1, 2023.

వెబ్‌సైట్: https://nhai.gov.in/

Also Read..

రాత పరీక్ష లేకుండానే ECIL లో ఉద్యోగాలు


Next Story

Most Viewed