ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 17 |
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2)/ఇంటర్మీడియట్ (సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి.

నిర్దిష్ట శారీరక దారుడ్య /వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు: డిసెంబర్ 26, 2002 నుంచి జూన్ 26, 2006 మధ్య జన్మించి ఉండాలి.

ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ ఉండాలి.

ఎంపిక: ఫేజ్ - 1, ఫేజ్ -3 (మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 17, 2023

పరీక్ష ప్రారంభం: మే 20, 2023.

వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in/AV



Next Story

Most Viewed