- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ఫ్ గోల్‌తో చెన్నయిన్ ఎఫ్‌సీ ఓటమి
<p>దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా బుధవారం రాత్రి జీఎంసీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ ఎఫ్‌సీపై జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 1-0 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివరి వరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. మరి కొన్ని నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా చెన్నయిన్ ఓన్ గోల్ చేసి ఓటమిని కొని తెచ్చుకున్నది. టాస్ గెలిచి జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ సీజన్‌లో నిలకడ లేమితో ఉన్న ఇరు […]</p>

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా బుధవారం రాత్రి జీఎంసీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ ఎఫ్‌సీపై జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 1-0 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివరి వరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. మరి కొన్ని నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా చెన్నయిన్ ఓన్ గోల్ చేసి ఓటమిని కొని తెచ్చుకున్నది. టాస్ గెలిచి జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ సీజన్‌లో నిలకడ లేమితో ఉన్న ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. తొలి అర్దభాగంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు.
ఇక రెండో అర్దభాగంలో ప్రత్యర్థి గోల్ పోస్టులపై దాడులు చేసినా గోల్స్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత సమయం ముగుస్తుందనగా చెన్నయిన్ ఎఫ్‌సీ డిఫెండర్ ఎనెస్ సిపోవిక్ సొంత గోల్ పోస్టులోకి బంతిని పంపాడు. చెన్నయిన్ చేసిన ఓన్ గోల్‌తో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కొద్ది సేపటికే రిఫరీ ఫైనల్ విజిల్ వూదాడు. దీంతో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 1-0 ఆధిక్యంతో గెలుపొందింది. ఫారూక్ చౌదరికి డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, స్టెఫెన్ ఎజెకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.






