- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్, భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటుంది : పాక్ ఆర్మీ చీఫ్
<p>దిశ,వెబ్‌డెస్క్: భారత్ పై పాకిస్థాన్ స్వరం మారింది. చైనా వేస్తున్న రుణాల వలకు చిక్కుకొని ఉక్కిరి బిక్కిరవుతున్న పాకిస్థాన్ భారత్ ఆపన్న హస్తం కోరుకుంటుందా..? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తూ మిత్రదేశాల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా కారణంగా దాయాది దేశం ఆర్థికంగా దెబ్బతిన్నది. దీంతో ఇతర దేశాల నుంచి తెచ్చిన అప్పుల్ని తీర్చేందుకు ఆదేశానికి చెందిన ప్రభుత్వ ఆస్తుల్ని లీజుకిస్తుంది. దీనికి […]</p>

దిశ,వెబ్‌డెస్క్: భారత్ పై పాకిస్థాన్ స్వరం మారింది. చైనా వేస్తున్న రుణాల వలకు చిక్కుకొని ఉక్కిరి బిక్కిరవుతున్న పాకిస్థాన్ భారత్ ఆపన్న హస్తం కోరుకుంటుందా..? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తూ మిత్రదేశాల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా కారణంగా దాయాది దేశం ఆర్థికంగా దెబ్బతిన్నది. దీంతో ఇతర దేశాల నుంచి తెచ్చిన అప్పుల్ని తీర్చేందుకు ఆదేశానికి చెందిన ప్రభుత్వ ఆస్తుల్ని లీజుకిస్తుంది. దీనికి తోడు కరోనా వైరస్ వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో భారత్ తో స్నేహం చేసేందుకు పాకిస్థాన్ కోరుకుంటుంది. ఇటీవల రావల్పిండిలో వైమానిక దళానికి సంబంధించి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక్, భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు. శాంతి యుతంగా సమస్యల్ని పరిష్కరించాలని కోరుకుంటుంది. అంతేకాదు పాక్ అన్నీ దేశాల నుంచి స్నేహాన్ని కోరుకుంటుంది’అని వ్యాఖ్యానించారు. మీరు నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్ధం చేసుకొని పెడార్థాలు తీయోద్దు. పాక్ అభివృద్ధినే కోరుకుంటుంది. జమ్ము-కాశ్మీర్ అంశాన్ని భారత్-పాక్‌లు శాంతియుతంగా చర్చించుకునేలా ప్రతీ ఒక్కరం కోరుకుందాం’అంటూ పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ అన్నారు.






