అమెజాన్, యాపిల్‌పై 200 మిలియన్ యూరోల జరిమానా

by  |
Apple
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆపిల్, బీట్స్ ఉత్పత్తుల అమ్మకం దారులపై ఆంక్షలతో EU చట్టాలను ఉల్లంఘించినందుకు అమెజాన్, యాపిల్‌పై 200 మిలియన్ యూరోల జరిమానాకు ఇటాలియన్ వాచ్‌డాగ్ ఆదేశించింది. Apple 134.5 మిలియన్ యూరోలు, అమెజాన్ 68.7 మిలియన్ యూరోలు చెల్లించాలని వాచ్‌డాగ్ ఆదేశించింది. రెండు US కంపెనీల మధ్య 2018 ఒప్పందం “Apple , Beats ఉత్పత్తులను ఎంపిక చేసిన పునఃవిక్రేతలను మాత్రమే Amazon.itలో విక్రయించడానికి అనుమతించారు. తమకు కావలసిన పార్టీలకు మాత్రమే వివక్షాపూరిత పద్ధతిలో అమ్మకానికి అనుమతించారు. ‘రిటైలర్ల సంఖ్యను పరిమితం చేయడం, సరిహద్దు అమ్మకాలను పరిమితం చేయడం దీని లక్ష్యం. ఇది యూరోపియన్ యూనియన్ నిబంధనలను ఉల్లంఘించిందని ధరలపై పోటీని ప్రభావితం చేస్తుందని వాచ్‌డాగ్ పేర్కొంది.

అమెజాన్, ఆపిల్ రెండూ జరిమానాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ‘మేము నిర్ణయంతో తీవ్రంగా విభేదిస్తున్నాం.. మేము అప్పీల్ చేయాలనుకుంటున్నాము’ అని అమెజాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. 2.4-బిలియన్ యూరోల యాంటీట్రస్ట్ జరిమానాపై గూగుల్ అప్పీల్‌ను యూరోపియన్ యూనియన్ కోర్టు తిరస్కరించిన రెండు వారాల తర్వాత ఇటలీ జరిమానా వచ్చింది.

గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ పోటీని అరికట్టడం, తగినంత పన్నులు చెల్లించకపోవడం, మీడియా కంటెంట్‌ను దొంగిలించడం, నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని ఆరోపించారు. Apple, Google తమ ఆన్‌లైన్ యాప్ మార్కెట్‌ప్లేస్‌ల పట్టును సడలించాలని బిగ్ టెక్ విమర్శకులు కోరుకుంటున్నారు. EU పోటీ నిబంధనలను ఉల్లంఘించే టెక్ సంస్థలపై 10 శాతం వరకు అమ్మకాల భారీ జరిమానాల కోసం ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది.


Next Story

Most Viewed