- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రద్ధాకపూర్ కు రోహన్ శ్రేష్ట తో పెళ్లి ? శ్రద్దా తండ్రి ఏమన్నాడంటే..
<p>దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ పెళ్లిపై ఆమె తండ్రి శక్తి కపూర్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్టు తన కూతురు ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టను పెళ్లి చేసుకోవడం లేదని, అలాంటి ప్రతిపాదనేదీ ఇంతవరకు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. రోహన్ తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పిన శక్తి కపూర్.. అతడి తండ్రి తనకు చాలా సంవత్సరాలుగా తెలుసన్నాడు. అంతేకాదు రోహన్ తరచూ ఇంటికి వస్తుంటాడని, కానీ ఎప్పుడూ […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ పెళ్లిపై ఆమె తండ్రి శక్తి కపూర్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్టు తన కూతురు ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టను పెళ్లి చేసుకోవడం లేదని, అలాంటి ప్రతిపాదనేదీ ఇంతవరకు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. రోహన్ తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పిన శక్తి కపూర్.. అతడి తండ్రి తనకు చాలా సంవత్సరాలుగా తెలుసన్నాడు. అంతేకాదు రోహన్ తరచూ ఇంటికి వస్తుంటాడని, కానీ ఎప్పుడూ శ్రద్ధాను పెళ్లి చేసుకుంటానని అడగలేదని తెలిపాడు. అయినా ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటి విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఒకవేళ శ్రద్ధ కూడా లైఫ్ పార్ట్‌నర్‌ను ఎంచుకున్నానంటే ఓకే చెబుతానని వెల్లడించాడు. ప్రస్తుతం వాళ్లిద్దరూ కెరీర్‌పై దృష్టి పెట్టారని, పైగా పెళ్లంటే జీవితంలో చాలా కీలక విషయమని, కానీ సింపుల్‌గా బ్రేకప్ అవుతున్న నేటితరాన్ని చూస్తే కొన్నిసార్లు ఆందోళన కలుగుతోందన్నాడు.
- Tags
- marriage






