- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానుకోట ఫార్మసీ కాలేజీలో మాయాజాలం.. అమ్మకానికే పోస్టులు
<p>దిశ ప్రతినిధి, వరంగల్/ మహబూబాబాద్ : మహబూబాబాద్ ప్రభుత్వ బీఫార్మసీ కాలేజీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది. కాంట్రాక్టు లెక్చరర్పోస్టుల భర్తీలో అధికారులు, ప్రొఫెసర్లు చేతివాటం చూపారు. ప్రిన్సిపాల్ పోస్టుతో పాటు మరో పది లెక్చరర్ పోస్టులను రూ10 లక్షల నుంచి 12లక్షల వరకు అమ్ముకున్నట్టు ఆరోపణలున్నాయి. నోటిఫికేషన్ విడుదల మొదలు.. ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అనుసరించిన విధానం కూడా అనుమానాలకు తావిస్తున్నది. నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించలేదు. ఎస్సీ ఎస్టీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి […]</p>

దిశ ప్రతినిధి, వరంగల్/ మహబూబాబాద్ : మహబూబాబాద్ ప్రభుత్వ బీఫార్మసీ కాలేజీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది. కాంట్రాక్టు లెక్చరర్పోస్టుల భర్తీలో అధికారులు, ప్రొఫెసర్లు చేతివాటం చూపారు. ప్రిన్సిపాల్ పోస్టుతో పాటు మరో పది లెక్చరర్ పోస్టులను రూ10 లక్షల నుంచి 12లక్షల వరకు అమ్ముకున్నట్టు ఆరోపణలున్నాయి. నోటిఫికేషన్ విడుదల మొదలు.. ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అనుసరించిన విధానం కూడా అనుమానాలకు తావిస్తున్నది. నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించలేదు. ఎస్సీ ఎస్టీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఎస్సీలకు ఒకే ఒక్క పోస్టును కేటాయించడం గమనార్హం. ఇక సీనియారిటీ, మార్కుల జాబితాను, పీహెచ్‌డీ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోలేదని సమాచారం. అభ్యర్థుల హర్డ్ కాపీలను పరిశీలించకుండా ఆన్‌లైన్‌లో పంపిన సాఫ్ట్ కాపీలను చూసి పోస్టులకు ఎంపిక చేశారనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా ప్రిన్సిపాల్ సహా మిగతా 10 లెక్చరర్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల అధికారులు ప్రకటించడం గమనార్హం. ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లోనూ ఉంచడం విశేషం.
11 పోస్టులకు 600లకు పైగా దరఖాస్తులు
రాష్ట్ర వ్యాప్తంగా బీఫార్మసీ గురుకులాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి పైలట్ కళాశాలను మహబూబాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలోనే తొలిసారిగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫార్మసీ కాలేజీని ప్రారంభించారు. కళాశాలలో విద్యాబోధనకు కావాల్సిన స్టాఫ్‌ను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. బోధనా సిబ్బంది నియామకానికి సెప్టెంబర్ 20న నోటిఫికేషన్ జారీ చేశారు. కనీస విద్యార్హత ఏం-ఫార్మసీ గా నిర్ణయించింది. మొత్తం 11 పోస్టులకు దాదాపు 600 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. దరఖాస్తుదారులకు ఎలాంటి సమచారం ఇవ్వకుండానే నియామకాలు చేపట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. మెరిట్ సాధించిన వారిని వదిలి కాసులు సమర్పించుకున్న వారికే కొలువులు దక్కాయని అంటున్నారు. ఈమేరకు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు.
అన్ని అర్హతలూ ఉన్నా కొలువు రాలేదు..
మాది హన్మకొండ. నేను మహబూబాబాద్‌లో బీ ఫార్మసీ గురుకుల కళాశాలలో టీచింగ్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. పీహెచ్ డీ పూర్తి చేశాను.15 సంవత్సరాల అనుభవం ఉంది. నోటిఫికేషన్ ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయి. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. ఉద్యోగాలు భర్తీ చేశారు. నాకన్నా తక్కువ క్వాలిఫికేషన్, తక్కువ సీనియారిటీ ఉన్నవాళ్లను ఎంపికచేశారు. ఏ విధంగా ఎంపిక చేశారో తెలియడం లేదు. హైకోర్టులో కేసు వేశాం.
= డాక్టర్ సునీల్, హనుమకొండ, అభ్యర్థి
అసమగ్రంగా నోటిఫికేషన్
ప్రభుత్వం జారీ చేసిన బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్ అసమగ్రంగా ఉంది. ఎన్ని ఉద్యోగాలు.. ఏ పద్ధతిన భర్తీ చేస్తున్నది..? అనే విషయాలు పేర్కొనలేదు. ఈ నియామక ప్రక్రియలో కేయూకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు కొలువులు అమ్ముకున్నారు. ఆంధ్ర వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు సైతం చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎస్టీలకు కనీసం ఒక్క ఉద్యోగం కూడా రాలేదు.
= డాక్టర్ జిమీడి భాస్కర్, ఇల్లందు
నిబంధనలు బేఖాతరు..
పీహెచ్‌డీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఏ ఉద్యోగానికైనా అకడమిక్ పర్‌ఫార్మెన్స్ ఇండెక్స్ స్కోర్ ప్రకారం మెరిట్ లిస్ట్ తీసి నియామకాలు చేపట్టాలి. ఈ నియామకాల్లో ఇలాంటి నిబంధనలు పాటించలేదు. అవినీతి మయంగా గురుకులాల వ్యవస్థ ఉంది. ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు లేదు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.
= డాక్టర్ విజయ్ భాస్కర్, మహబూబాబాద్






