హోం మంత్రిని కలిసిన నూతన ఇరాన్ కాన్సుల్

50

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీని ఇరాన్ నూతన జనరల్ మహమ్మద్ హుస్సేన్ బని అసాధి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇరాన్ కాన్సుల్ జనరల్‌గా మహమ్మద్ హగ్బిన్ ఘోమి పదవీ కాలం ముగియడంతో మహమ్మద్ హుస్సేన్ బని అసాది నూతనంగా నియామకం అయ్యారు. గతంలో ఈయన బల్గేరియా, బ్రెజిల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పని చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ జనరల్ కాన్సుల్ అసాదితో హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తన వంతు సహకారం ఎల్లప్పుడు అందిస్తానని తెలియజేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..